Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎన్నో రికార్డులు బద్దలు: లారా రికార్డుని సమం చేసిన కోహ్లీ

India vs Sri Lanka, 2nd Test: Virat Kohli equals Brian Lara's record of most double hundreds by a captain

హైదరాబాద్: అభిమానుల కోహ్లీకి ఏ శుభముహూర్తాన 'రన్ మెషిన్' అని పేరు పెట్టారేమో గానీ అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. బౌలర్లను ఊచకోత కోయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ చెలరేగి డబుల్ సెంచరీ చేశాడు.

 కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌

కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఎన్నో మైలు రాళ్లను అందుకున్నాడు. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం నాటి సెంచరీ కోహ్లీకి కెప్టెన్‌గా 12వ సెంచరీ కావడం విశేషం. దీంతో అంతకు ముందు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 11 సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించాడు.

Kohli records most centuries in a year by a captain
 టెస్ట్ కెరీర్‌లో ఐదు డబుల్ సెంచరీలు

టెస్ట్ కెరీర్‌లో ఐదు డబుల్ సెంచరీలు

ఈ రికార్డుతో తృప్తి చెందని కోహ్లీ తన పరుగుల వేటను కొనసాగించి డబుల్ సెంచరీ చేశాడు. దీంతో, టెస్ట్ కెరీర్‌లో ఐదు డబుల్ సెంచరీలను నమోదు చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా (5 డబుల్ సెంచరీలు) రికార్డును సమం చేశాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కోహ్లీ చేసిన ఐదు డబుల్ సెంచరీలు కెప్టెన్‌గా చేసినవే.

 రెండో టెస్టులో నమోదైన రికార్డులివే:

రెండో టెస్టులో నమోదైన రికార్డులివే:

* భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన మూడో ఆటగాడు కోహ్లీ (5) అరుదైన ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు చెరో 6 డబుల్ సెంచరీలు చేయగా, రాహుల్ ద్రవిడ్ 4 చేశాడు.

* ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు సెంచరీలు చేయడం భారత్ తరఫున ఇది మూడోసారి. గతంలో దక్షిణాఫ్రికా, బంగ్లాపై ఈ ఘనతను సాధించారు.

* కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్రియాన్ లారా (5) రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో కెప్టెన్‌గా 10 సెంచరీలు

* ఒక క్యాలెండర్ ఇయర్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల (6 వన్డేలు, 4 టెస్టులు)లో కలిపి 10 సెంచరీలు చేశాడు. పాంటింగ్ (9 సెంచరీలు), గ్రేమ్ స్మిత్ (9)లను అధిగమించాడు.

* టెస్టు కెప్టెన్‌గా భారత్ తరఫున అత్యధిక సెంచరీల గవాస్కర్ (11) రికార్డును విరాట్ కోహ్లీ (12) అధిగమించాడు.

* టెస్టుల్లో 19 సెంచరీలు చేయడానికి కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ 114 కాగా... సచిన్‌కు 115 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. మొత్తంగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (53 ఇన్నింగ్స్) అందరికంటే ముందున్నాడు.

Story first published: Monday, November 27, 2017, 13:16 [IST]
Other articles published on Nov 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+