Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొలంబో టెస్టు: అశ్విన్ మరో రికార్డు, హర్భజన్‌ను అధిగమించాడు

హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో శ్రీలంకను కట్టడి చేశాడు.

అశ్విన్‌కు జతగా రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు కూడా రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామ సమయానికి 49.4 ఓవర్లలో 183 పరుగులకే అలౌటైంది. 50/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన లంక మరో 133 పరుగులు చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది.

India vs Sri Lanka, 2nd Test, Day 3: Ashwin grabs five wickets, overtakes Harbhajan

భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి రెండో రెండు వికెట్లు తీశారు. అశ్విన్ తన కెరీర్‌లో 5 వికెట్ల ఫీట్‌ని 26వ సారి సాధించాడు. దీంతో టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (25 సార్లు)ను అధిగమించాడు.

భారత బౌలర్లలో అనిల్‌ కుంబ్లే మొత్తం 36 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను సాధించి అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే అశ్విన్ తన 51వ టెస్టులోనే ఈ అరుదైన ఘనతను సాధించగా, హర్భజన్ సింగ్‌కు 103 టెస్టులు పట్టింది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 23 సార్లు 5 వికెట్లు తీశాడు.

అయితే అశ్విన్‌కి ఇది మరో కావడం గమనార్హం. ఎందుకంటే ఇదే 51 టెస్టుల్లో ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్(19), పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్‌ (12) సార్లు మాత్రమే 5 వికెట్లను తీశారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 51 టెస్టులాడిన (రెండో టెస్టులో ఇంకో ఇన్నింగ్స్ మిగిలి ఉంది) అశ్విన్ 284 వికెట్లు తీశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+