
హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 107 పరుగులు ఆధిక్యం సాధించింది. క్రీజులో పుజారా (121), కోహ్లీ (54) పరుగులతో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో గమాగే, హెరాత్ చెరో వికెట్ తీశారు.
రెండో రోజు మ్యాచ్ తీరు సాగిందిలా:
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 66 బంతుల్లో 6 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 15వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
లంకపై 4వది: టెస్టుల్లో 14వ సెంచరీ సాధించిన పుజారా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ నమోదు చేశాడు. 250 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో పుజారా 101 పరుగులు చేశాడు. ఓవర్ నైట్ స్కోరు 11/1తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాకు విజయ్-పుజారాల జోడీ నిలకడగా ఆడుతూ చక్కటి భాగస్వామ్యాన్ని అందించింది. వీరిద్దరూ కలిసి 209 పరుగుల భాగస్వాయ్యన్ని నమోదు చేశారు. కాగా 76వ ఓవర్‌లో విజయ్ ఔట్ కాగా... అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి పుజారా ఆచితూచి ఆడతూ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 65 పరుగుల ఆధిక్యంలో ఉంది.
నాగ్‌పూర్ టెస్టులో పుజారా అరుదైన ఘనత
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది భారత్ నుంచి ఈ ఘనత సాధించి ఒక్కే ఒక్కడు పూజారా. ఇప్పటివరకు ఈ ఏడాది కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే టెస్టుల్లో 1000 పరుగులు నమోదు చేశారు.
అందులో ఒకరు దక్షిణాఫ్రికాకు చెందిన దేనా ఎల్గర్ కాగా, రెండో ఆటగాడు శ్రీలంకకు చెందిన కరుణరత్నే. కరుణరత్నే ఈ ఘనతను ఇదే టెస్టులో తొలిరోజు నమోదు చేయడం విశేషం. ఎల్గర్ 20 ఇన్నింగ్స్‌ల్లో 1097 పరుగులు చేయగా, కరుణరత్నే 23 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు నమోదు చేయడం విశేషం. కాగా, 1000 పరుగులు సాధించేందుకు పుజారాకు 16 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ ముగ్గురిలో పుజారా 71.14 యావరేజితో మెరుగ్గా ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీ అనంతరం జట్టు స్కోరు 216 పరుగుల వద్ద మురళీ విజయ్ (128) రంగనా హెరాత్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో పుజారా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విజయ్ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో అధిక సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌గా విజయ్ గుర్తింపు పొందాడు.
టీ విరామానికి భారత్ 185/1
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టీ విరామానికి ఒక వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 11/1తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా, మురళీ విజయ్‌లు శ్రీలంక బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఈ క్రమంలో మురళీ విజయ్ సెంచరీ సాధించగా, పుజారా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
నాగ్ పూర్ టెస్టులో మురళీ విజయ్ సెంచరీ
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ సెంచరీ నమోదు చేశాడు. 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 10వ సెంచరీ. గాయం కారణంగా దూరమై.. ఫిట్‌నెస్ సాధించి చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన విజయ్ రాణించడం భారత్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు పుజారా(63) సైతం నెమ్మదిగా ఆడుతూ విజయ్‌కు మద్దతిస్తున్నాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 173 పరుగులు చేసింది.
పుజారా హాఫ్ సెంచరీ
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మన్ పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 145 బంతులాడిన పుజారా 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 17వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్‌లో మురళీ విజయ్(84) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం 55 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 144 పరుగులు చేసింది.

లంచ్ విరామానికి భారత్ 97/1
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు లంచ్ విరామానికి భారత్ 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 56, పుజారా 33 పరుగులతో ఉన్నారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 108 పరుగులు వెనుకబడి ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 11/1తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా బ్యాట్స్‌మన్లు ఆచితూచి ఆడుతూ భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపారు. రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన విజయ్-పుజారా చక్కని శుభారంభం ఇచ్చారు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 90 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. అలాగే మొదటి సెషన్‌ను వికెట్ ఇవ్వకుండానే ముగించారు.

రెండో టెస్టు: మురళీ విజయ్ హాఫ్ సెంచరీ
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన విజయ్.. తన పునరాగమన మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 112 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఓవర్ నైట్ స్కోరు 11/1తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియాకు బ్యాట్స్‌మన్లు చక్కని శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ, శ్రీలంక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. మరో ఎండ్‌లో పుజారా కూడా నెమ్మదిగా ఆడుతున్నాడు.
ప్రస్తుతం భారత్ 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. విజయ్ 54, పుజారా 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 113 పరుగులు వెనుకబడి ఉంది.

20 ఓవర్లకు భారత్ 42/1
నాగ్ పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం పుజారా(13), విజయ్(21) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 163 పరుగులు వెనకబడి ఉంది.
ఫోర్‌తో రెండో రోజు ఆటకు స్వాగతం పలికిన మురళీ విజయ్
నాగ్ పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 11/1 తో భారత్ రెండో ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ప్రారంభంచింది. శ్రీలంక బౌలర్ లక్మల్ వేసిన తొలి బంతిని ఓపెనర్ మురళీ విజయ్ ఫోర్‌గా మలిచి రెండో రోజు ఆటకు స్వాగతం పలికాడు.
భారత్ Vs శ్రీలంక రెండో టెస్టు స్కోరు కార్డు
ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. విజయ్(7), పుజారా(2) క్రీజులో ఉన్నారు. శుక్రవారం టాస్ గెలిచి బ్యాటింగ్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.