For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20లో భారత్ ఘన విజయం: 2-0తో సిరిస్ కైవసం

By Nageshwara Rao
Rohit

హైదరాబాద్: ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. శుక్రవారం హోల్కార్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో శ్రీలంకపై భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను గెలిపించేందుకు లంక బ్యాట్స్‌మెన్లు కుషల్ పెరీరా(77), తరంగా(47) తీవ్రంగానే కష్టపడ్డారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కి 109 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. జట్టు స్కోరు 145 పరుగుల వద్ద తరంగ ఔట్ కావడంతో ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు. దీంతో శ్రీలంక 17.2 ఓవర్లలో 172 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో శ్రీలంక జట్టును ఆలౌట్‌గా డిక్లేర్ చేశారు.

భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ మూడు, హార్థిక్, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. తద్వారా లంకతో జరిగిన టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌లతో తాజాగా టీ20 సిరిస్‌ను భారత్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


లంక ఇన్నింగ్స్ సాగిందిలా:

ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఒకే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది.
ఓవర్ తొలి బంతికి తీసార పెరీరా డకౌట్‌ కాగా, రెండో బంతికి కుశాల్‌ పెరీరా(77: 37 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులు),ఐదో బంతికి గుణరత్నె డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. శ్రీలంక విజయానికి ఇంకా 30 బంతుల్లో 99 పరుగులు చేయాలి.

10 ఓవర్లకు శ్రీలంక 102/1
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. ఓపెనర్‌ డిక్వెలా(25) ఉనద్కత్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్‌ పెరీరా(31), మరో ఓపెనర్‌ తరంగ(42) దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ కోల్పోయి శ్రీలంక 102 పరుగులు చేసింది. లంక విజయానికి 60 బంతుల్లో ఇంకా 159 పరుగులు చేయాలి.

4 ఓవర్లకు శ్రీలంక 36
భారత్‌ నిర్దేశించిన 261 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. లంక ఓపెనర్లు డిక్వెలా, ఉపుల్‌ తరంగ ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా శ్రీలంక 36 పరుగులు చేసింది. డిక్వెలా(25), తరంగ(9) పరుులతో క్రీజులో ఉన్నారు.

Rohit Sharma-KL Rahul

శ్రీలంక లక్ష్యం 261

ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా పలు రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌తో ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయగా... భారత జట్టు మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో టీమిండియా అత్యధిక స్కోరుని నమోదు చేసింది.

గతంలో భారత్ అత్యధిక స్కోరు 244ను ఈ మ్యాచ్‌లో దాటేసింది. అంతేకాదు టీ20ల్లో ప్రపంచంలోనే అత్యధిక స్కోరు 263కు చేరువగా వచ్చింది. దీంతో టీ20ల్లో ప్రపంచంలోనే రెండో అత్యధిక స్కోర్‌ను భారత్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ టార్గెట్‌ను శ్రీలంక ముందు ఉంచింది.

ఈ మ్యాచ్లో భారత్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 261 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(118) మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(89)తో కలిసి తొలి వికెట్‌కి 165 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

రోహిత్ శర్మ అవుటైన తర్వాత స్కోరు బోర్డు కాస్తంత నెమ్మదించింది. చివర్లో వరుసగా వికెట్లను కోల్పోయింది. దీంతో ధోని (28), పాండ్యా (10) పాండే (1 నాటౌట్), దినేశ్ కార్తీక్ (5 నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో పెరీరా రెండు వికెట్లు తీసుకోగా, ప్రదీప్ రెండు, చమీరా ఒక వికెట్ తీసుకున్నాడు.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ
ఇండోర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 165 పరుగులు భారీ భాగస్వామ్యం నమోదు చేసిన రాహుల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. హఫ్ సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన ఆడిన రాహుల్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 71 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజులో ధోని (25), కేఎల్ రాహుల్ (71) పరుగులతో ఉన్నారు.

118 పరుగులు వద్ద రోహిత్ శర్మ ఔట్
ఇండోర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత తొలి వికెట్ కోల్పోయింది. భారత కెప్టెన్ రోహిత్ 118 పరుగులు చేసి వెనుదిరిగాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ తొలుత నిలకడగా ఆడి ఆ తర్వాత వేగం పెంచాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగతా 50 పరుగులు పూర్తి చేసిన సెంచరీ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ.

టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. లంక కెప్టెన్ పెరీరా వేసిన 11వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. కాగా చమీరా వేసిన 13వ ఓవర్‌లో తొలి మూడు బంతులను సిక్స్, ఫోర్, సిక్స్ బాదిన రోహిత్ ఆ తర్వాతి బంతిని కూడా బౌండరికి తరలించే ప్రయత్నంలో ధనంజయకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 13 ఓవర్ ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(46), ధోని(1) ఉన్నారు.

35 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ఇండోర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ (101)ని సాధించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫోర్ బాది సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేవరకు భారత్ 148/0 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (101), కేఎల్ రాహుల్ (46) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫామ్‌లో రోహిత్ శర్మ; 23 బంతుల్లో హాఫ్ సెంచరీ
శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు దుమ్మురేపుతున్నారు. కొడితే సిక్సర్లు లేదంటే బౌండరీలు అన్నట్టు బ్యాటింగ్‌ ఉంది. ఓపెనర్లు దెబ్బకు హోల్కర్ స్టేడియంలో ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (73) భారీ షాట్లు ఆడుతున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. కేఎల్‌ రాహుల్‌ (44) బంతిని బలంగా బాదుతున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది.

పవర్‌ప్లేలో దంచికొట్టిన భారత ఓపెనర్లు
ఇండోర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ గెలవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ గ్రౌండ్‌లో బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. పవర్‌ప్లేలో(ఆరు ఓవర్లు) రోహిత్ 4ఫోర్లు, 2 సిక్సులు బాది 32 పరుగులు చేయగా.. రాహుల్ 2 ఫోర్లు 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్(47), కేఎల్ రాహుల్(40) పరుగులతో ఉన్నారు.

5 ఓవర్లకు భారత్ 43/0
ఇండోర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియాకు చక్కటి శుభారంభం లభించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 43 పరుగులు పరుగులు చేసింది. ఓపెనర్లు లోకేశ్‌ రాహుల్‌ (26), రోహిత్‌ శర్మ (17) నిలకడగా ఆడుతున్నారు.

India Vs Sri Lanka, 2nd T20I: Thisara Perera invites Rohit Sharma to bat first

టాస్ గెలిచిన శ్రీలంక, భారత్ బ్యాటింగ్

భారత్-శ్రీలంక మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం లంక కెప్టెన్ పెరీరా మాట్లాడుతూ 'మేం ఫీల్డింగ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ స్టేడియంలో బౌండరీ దూరం చాలా తక్కువ. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇచ్చిన టార్గెట్ మేం చేధించాలని భావిస్తున్నాం' అని తెలిపాడు.

భారత్-శ్రీలంక రెండో టీ20 స్కోరు కార్డు

అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ 'టాస్ ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు. మేం ముందు బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. తొలి టీ20 మాదిరిగానే ఈ గ్రౌండ్‌లో పిచ్ అనుకూలంగా ఉంది. కాబట్టి మేం ముందు మంచి స్కోర్ చేసి ఆ తర్వాత అంతే మంచిగా బౌలింగ్ చేస్తాం' అని అన్నాడు.

ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా టీ20 సిరిస్‌ని కూడా చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా తొలి టీ20 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని శ్రీలంక గట్టి పట్టుదలతో ఉంది.

ఇందు కోసం తుది జట్టులో రెండు మార్పులు చేసింది. తొలి టీ20లో ఆడిన విశ్వ ఫెర్నాండో, దాసున్ శంకా స్థానంలో సదీరా సమరవిక్రమ, దుశ్మతా చతురంగాకి జట్టులో స్థానం కల్పించారు.

జట్ల వివరాలు:
భారత్‌: రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ధోనీ, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, యజువేంద్ర చాహల్

శ్రీలంక: నిరోషన్‌ డిక్వెలా, ఉపుల్‌ తరంగ, కుశాల్‌ పెరీరా, ఏంజెలో మాథ్యూస్‌, సదీర సమరవిక్రమ, ఆసేల గుణరత్నె, తిసారా పెరీరా, చతురంగ డిసిల్వా, అఖిల ధనంజయ, దుష్మంత చమీరా, నువాన్‌ ప్రదీప్‌

Story first published: Friday, December 22, 2017, 22:50 [IST]
Other articles published on Dec 22, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+