Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టీ20: రోహిత్ శర్మ రికార్డ్ సెంచరీ, డేవిడ్ మిల్లర్ రికార్డు సమం

Rohit Sharma

హైదరాబాద్: ఇండోర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కుల చూపించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ తొలుత నిలకడగా ఆడి ఆ తర్వాత వేగం పెంచాడు.

23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతడు ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగతా 50 పరుగులు పూర్తి చేసిన సెంచరీ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ. 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 101 పరుగులను రోహిత్ శర్మ సాధించాడు. టీ20 చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. మొత్తం 12 ఫోర్లు, 10 సిక్సులు బాదిన రోహిత్ శర్మ.. 43 బంతులకు 118 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా వేసిన 13వ ఓవర్‌లో తొలి మూడు బంతులను సిక్స్, ఫోర్, సిక్స్ బాదిన రోహిత్ ఆ తర్వాతి బంతిని కూడా బౌండరికి తరలించే ప్రయత్నంలో ధనంజయకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో భారత్ 13 ఓవర్ ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది.

Story first published: Friday, December 22, 2017, 20:36 [IST]
Other articles published on Dec 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+