Ind vs SL 2nd ODI:శ్రీలంకతో రెండో వన్డే..యువ భారత్‌కు ఎదురుందా?సిరీస్‌పై గబ్బర్ సేన కన్ను!తుది జట్లు ఇవే!

కొలంబో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టిన ధావన్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే ట్రోఫీని పట్టేయాలని చూస్తోంది. మంగళవారం జరిగే రెండో వన్డేలో శ్రీలంకను భారత్ ఢీకొంటుంది. ఈ ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆడుతున్న చివరి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే కాగా.. మెగాటోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలని యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
తొలి వన్డేలో భారత లక్ష్యఛేదన గమనించిన వారికి ఇది వన్డేనా.. లేక టీ20నా అన్న అనుమానం రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. మరోవైపు శ్రీలంక పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గెలవడం మాట అటుంచి కనీసం ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఉంది.

పాండేకు మరో ఛాన్స్
తొలి వన్డేలో కెప్టెన్ శిఖర్ ధావన్ చివరి వరకు క్రీజులో నిలబడగా.. పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో లక్ష్యాన్ని టీమిండియా 37వ ఓవర్లోనే ఛేదించింది. లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌కు భారత్ తుది జట్టులో దాదాపు ఎలాంటి మార్పులూ చేసే అవకాశం లేదు.
ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న యువ భారత్.. చివరి మ్యాచ్‌లో ఇతర కుర్రాళ్లకు అవకాశమిచ్చే అవకాశముంది. మనీష్ పాండేకు మాత్రమే కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది. మొదటి మ్యాచ్‌లో మిగతా వాళ్లు దూకుడు ప్రదర్శిస్తే.. అతడు మాత్రం 40 బంతుల్లో 26 పరుగులే చేశాడు. అయితే అతడికి మరో అవకాశం ఇవ్వనున్నారు.

భువనేశ్వర్ గాడిలో పడితే
బౌలింగ్‌లో కూడా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి కేవలం ఒక్క వికెటే దక్కినా.. ప్రత్యర్థి ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, దీపక్ చహర్ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే అనుభవజ్ఞుడు భువనేశ్వర్ కుమార్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే రెండో వన్డేలో అతను బౌలింగ్ లయను అందుకుంటాడనే విశ్వాసంతో భారత్ మేనేజ్‌మెంట్ ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే:
బలహీనంగా కనిపిస్తోన్న శ్రీలంక.. సిరీస్‌లో పుంజుకోవాలంటే అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. తొలి వన్డేలో చాలా మంది లంక బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించారు. కానీ ఆరంభాలను పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయారు. ఈ లోపాన్ని వాళ్లు సరిదిద్దుకోవాలి.
భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే.. మధ్య ఓవర్లలో, స్పిన్నర్ల బౌలింగ్‌లో లంక స్ట్రైక్ రొటేషన్ మెరుగుపడడం తప్పనిసరి. ఇక నాణ్యమైన భారత బ్యాటింగ్‌ను ఒత్తిడిలోకి నెట్టాలంటే లంక బౌలింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరముంది. పేస్ బౌలర్ చమీరకు మంచి బౌలింగ్ భాగస్వామి అవసరం. ఉదాన కూడా గాడిలో పడాల్సిన అవసరం ఉంది.

పిచ్ రిపోర్ట్:
కొలంబోని ప్రేమదాస మైదానం పిచ్ స్పిన్‌కు సహకరించినా.. బ్యాటింగ్‌కూ అనుకూలించే అవకాశముంది. ఇక్కడ ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. సగటు స్కోర్ 300లుగా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ కోసం వేరే పిచ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇక టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గుచూపవచ్చు. సాధారణంగా ఈ కాలంలో ఇక్కడ జల్లులు పడుతుంటాయి. కానీ మంగళవారం మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

తుది జట్లు (అంచనా):
భారత్: ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్.
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ, చరిత్ అసలంక, హసరంగ, కరుణరత్నే, చమీర, సందకన్, లహిరు కుమార.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
హార్దిక్, బుమ్రా స్కూల్ వరకే.. రోహిత్, కోహ్లీ ఇంటర్! అశ్విన్ వేరే లెవెల్! మరి సచిన్, ధోనీ, రహానే ఏం చదివారంటే?