హైదరాబాద్: పల్లెకెలె వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధోని (45 నాటౌట్), భువనేశ్వర్ కుమార్ (53 నాటౌట్)లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో శ్రీలంక నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 44.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శ్రీలంక బౌలర్ ధనంజయ (6/54) సంచలన బౌలింగ్‌లో ఒకానొక దశలో 131కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ధోని, భువీల జంట ఆదుకుంది. వీరిద్దరూ సెచంరీకి పైగా భాగస్వామ్యాన్ని నెలకోల్పడంతో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 231 పరుగులకు కుదించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో కోహ్లీసేన సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ప్రారంభమైన మ్యాచ్: 47 ఓవర్లకు కుదింపు
వర్షం తగ్గడంతో పల్లెకెలె వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 47 ఓవర్లకు కుదించారు. దీంతో కోహ్లీ సేనకు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.
మ్యాచ్‌కి వర్షం అడ్డంకి
పల్లెకెలె వేదికగా భారత్-శ్రీలంక రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. శ్రీలంక విధించిన 237 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వాన అడ్డంకిగా మారడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. విరామం తర్వాత టీమిండియా లక్ష్యఛేదనకు దిగే ముందు వర్షం వచ్చింది. దీంతో స్టేడియం సిబ్బంది మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేశారు.

భారత్ విజయ లక్ష్యం 237
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఓపెనర్లు ఆరంభంలో దూకుడుగా ఆడినా ఆపై భారత బౌలింగ్ దెబ్బకు వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్ డిక్ వెల్లా(31) దాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో బూమ్రా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా అవుటయ్యాడు. ఆ తర్వాత గుణతిలక(19), ఉపుల్ తరంగా(9), కుశాల్ మెండిస్(19) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో శ్రీలంక 99 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏంజెలో మ్యాథ్యూస్ (20), మలింద సిరివర్ధన (58), కపుదెరగ (40), ధనుంజయ (9) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీసుకోగా, చాహుల్ రెండు, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యాలు తలో వికెట్ తీసుకున్నారు.
శ్రీలంక బ్యాటింగ్ తీరు సాగిందిలా:
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 212 పరుగుల వద్ద సిరివర్ధన అవుటయ్యాడు. 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరివర్దన... బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 45 ఓవర్లు ముగిసే సరికి లంక 6 వికెట్లు కోల్పోయి శ్రీలంక 212 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కపుగెదెర 39, ధనుంజయ 2 పరుగులతో ఉన్నారు.

మిలింద సిరివర్దన హాఫ్ సెంచరీ
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాడు మిలింద సిరివర్దన 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన తర్వాత మరో వికెట్ పడకుండా కపుగెదెరతో జాగ్రత్తగా ఆడాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ పది ఓవర్లకు పైగా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నారు. దీంతో 43 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి శ్రీలంక 200 పరుగులు చేసింది. ప్రస్తుతం మిలింద సిరివర్ధన 54, కపుగెదెర 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.
35 ఓవర్లకు శ్రీలంక 154/5
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక 35 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న చమర కపుగెదర 14, మిలింద సిరివర్దన 27 నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి 39 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రెండో వన్డే: ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. 99 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంకను అక్షర్ పటేల్ మరోమారు దెబ్బతీశాడు. క్రీజులో కుదురుకుంటున్న మాథ్యూస్ 20 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో లంక పీకలోతు కష్టాల్లో పడింది.
గత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు డిక్‌విల్లా, గుణతికల ఈ మ్యాచ్‌లోనూ నిరాశ పరిచారు. ఆదుకుంటారనుకున్న మెండిస్, కెప్టెన్ ఉపుల్ తరంగ కూడా విఫలమయ్యారు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మిలింద సిరివర్ధన (12), కపుగెదెర (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక: 25 ఓవర్లకు 107/4
రెండో వన్డేలో శ్రీలంక వికెట్ల పతనం కొనసాగుతోంది. పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 107 పరుగుల వద్ద శ్రీలంక మెండిస్ అవుటయ్యాడు. మెండిస్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ఏంజెలో మాథ్యూస్ 12, మిలింద సిరివర్దన 6 క్రీజులో ఉన్నారు. దీంతో 25 ఓవర్లు ముగిసే సరికి లంక 4 వికెట్లు కోల్పోయి శ్రీలంక 107 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక: 17 ఓవర్లకు 83/3
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 81 పరుగుల వద్ద శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ 9 పరుగుల వద్ద అవుటయ్యాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఉపుల్ తరంగ వెనుదిరిగాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి లంక 3 వికెట్లు కోల్పోయి శ్రీలంక 83 పరుగులు చేసింది. ప్రస్తుతం కుశాల్ మెండిస్ 14, మ్యాథ్యూస్ 0 పరుగులతో ఉన్నారు.
99వ స్టంపింగ్ చేసిన ధోని
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. వన్డే కెరీర్‌లో ధోని 99వ స్టంపౌట్ చేశాడు. దీంతో రెండో వన్డేలో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ గుణతిలక అవుటయ్యాడు. చాహల్ వేసిన 14.1వ బంతిని ఆడేందుకు గుణతిలక క్రీజు వదిలి ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ధోని వికెట్లను గిరాటేశాడు.

రెండో వికెట్ కోల్పోయిన లంక: 15 ఓవర్లకు 80/2
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో జట్టు స్కోరు 70 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో ఓపెనర్ దనుష్క గుణతిలక (19) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి లంక రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం కుశాల్ మెండిస్ 13, కెప్టెన్ ఉపుల్ తరంగ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక: 9 ఓవర్లకు 52/1
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతున్న లంక ఓపెనర్ డిక్‌వెల్లాను బుమ్రా అవుట్ చేశాడు. భారీ షాట్‌కు యత్నించిన డిక్‌వెల్లా 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. గుణతిలక 14, కుశాల్ మెండిస్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
నిలకడగా శ్రీలంక: 5 ఓవర్లకు 28/0
పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 5 ఓవర్లకు గాను శ్రీలంక వికెట్ నష్టపోకుండా 28 పరులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డిక్‌వెల్లా 20, గుణతిలక 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే కోహ్లీసేన బరిలోకి దిగుతోంది.
జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, తొలి వన్డే ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కోహ్లీ చెప్పాడు. ఈ వన్డే తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. కోహ్లీకిది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు కోహ్లీ 60 టెస్టులు, 190 వన్డేలు, 49 టీ20లు ఆడాడు. ఈ వన్డే కోహ్లీకి 191వది.
ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించి జోరుమీదున్న కోహ్లీసేన ఈ వన్డేను కూడా గెలుచుకుని ఆధిక్యం సంపాదించాలన్న ఉద్దేశంతో ఉంది. టెస్టు సిరిస్ పరాజయంతో అభిమానుల ఆగ్రహానికి గురైన శ్రీలంక జట్టు మాత్రం ఎలాగైనా ఈ వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.
ఇందులో భాగంగా శ్రీలంక తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తిషారా పెరారా, వానిడు, సందకన్‌ల స్థానంలో దుష్మంతా, అకిలా ధనంజయ, మిలింద సిరివర్దన్‌లు తుది జట్టులోకి వచ్చారు. ఈ వన్డే శ్రీలంక క్రికెట్ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోనుంది.
ఎందుకంటే శ్రీలంక జట్టుకు ఇది 800వ వన్డే కావడం విశేషం. ఈ చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌లోనైనా శ్రీలంక విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు 2019లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే లంక ఈ సిరీస్‌లో కనీసం 2 వన్డేలైనా తప్పక నెగ్గాలి. ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీసేన ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
జట్ల వివరాలు:
శ్రీలంక: ఉపుల్ తరంగా(కెప్టెన్), నిరోషన్ డిక్ వెల్లా, దనుష్క గుణతిలకా, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, కపుగెదెరా, మిలిందా సిరివర్దనా, అకిలా దనంజయ, లసిత్ మలింగా, విశ్వ ఫెర్నాండో, దుశ్మాంతా చమీరా
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రా, చాహల్