Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఓడాం సరే, కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించలేదు'

India vs Sri Lanka 2017: Sri Lanka Have to Show Some Fight, Says Upul Tharanga

హైదరాబాద్: కటక్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో శ్రీలంక పేలవ బ్యాటింగ్ తనను ఎంతగానో నిరాశకు గురి చేసిందని ఆ జట్టు ఓపెనర్ ఉపుల్ తరంగ పేర్కొన్నాడు. తొలి టీ20లో ఓటమి కంటే, ఓడిన విధాం తనని ఎక్కువగా బాధిస్తోందని ఉపుల్ తరంగ ఆవేదన వ్యక్తం చేశాడు.

తొలి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసిన సంగత తెలిసిందే. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16 ఓవర్లలోనే 87 పరుగులు చేసి ఆలౌటైంది. భారత పర్యటనలో ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను చేజార్చుకుంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఉపుల్ తరంగ మాట్లాడుతూ మూడు టీ20ల సిరిస్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశించిన తనకి నిరాశే ఎదురైందని అన్నాడు. 'కటక్ టీ20లో శ్రీలంక పేలవ బ్యాటింగ్‌ నన్ను నిరాశపరిచింది. కనీసం 20 ఓవర్లు అయినా ఆడి ఉండాల్సింది. మ్యాచ్‌లో ఓడిపోయాం సరే.. కనీసం లక్ష్యానికి చేరువయ్యేందుకైనా ప్రయత్నించాలి కదా?' అని అన్నాడు.

'నిజానికి తొలి టీ20లో భారత్‌కి ఏమాత్రం పోటీనివ్వలేకపోయాం. బౌలింగ్ విషయానికి వస్తే మ్యాచ్ ఆరంభంలో బాగానే చేశామని, కానీ... మధ్య ఓవర్లు, చివర్లో మా బౌలర్లు తేలిపోయి వరుసగా బౌండరీలు సమర్పించేసుకున్నారు. మిగిలి రెండు టీ20ల్లోనైనా గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తాం' అని తరంగ అన్నాడు.

ఈ మధ్య కాలంలో తన బ్యాటింగ్ టెక్నిక్ మెరుగవ్వడానికి కారణం మాజీ టెస్టు క్రికెటర్ తిలన్ సమీరవీర అని తరంగ అన్నాడు. సమీరవీరతో కలిసి ఎన్నో మ్యా‌చ్‌లు ఆడానని, అతడు చెప్పడం వల్లే తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మార్చుకున్నానని తరంగ చెప్పుకొచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 15:03 [IST]
Other articles published on Dec 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+