For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాలె టెస్ట్: అజహరుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన‌ టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి మ‌రో రికార్డు సాధించాడు. గాలె టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి ఇప్ప‌టివ‌ర‌కు 9 సెంచ‌రీల‌తో అజహరుద్దీన్ పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ అధిగ‌మించాడు. కేవ

By Ramesh Babu

గాలె: ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి మ‌రో రికార్డు సాధించాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచ‌రీ సాధించిన విష‌యం తెలిసిందే. టెస్టుల్లో అత‌నికిది 17వ సెంచ‌రీ.

అంతేకాదు కెప్టెన్‌గా విరాట్ కి ఇది ప‌దో సెంచ‌రీ. ఇప్ప‌టివ‌ర‌కు 9 సెంచ‌రీల‌తో అజహరుద్దీన్ పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ అధిగ‌మించాడు. కేవ‌లం 44 ఇన్నింగ్స్‌లోనే కెప్టెన్‌గా ప‌దో సెంచ‌రీ చేశాడు విరాట్‌.

India Vs Sri Lanka, 1st Test: Virat Kohli slams 17th Test century, breaks several records

ఇప్పుడు టెస్టుల్లో అత‌ని స‌గ‌టు కూడా 50 దాట‌డం విశేషం. అజ‌హర్ కెప్టెన్‌గా 68 ఇన్నింగ్స్‌లో 9 సెంచ‌రీలు చేశాడు. ఇక కెప్టెన్‌గా అత్య‌ధిక టెస్ట్ సెంచ‌రీలు చేసిన‌ గవాస్క‌ర్ కంటే కేవ‌లం ఒక సెంచ‌రీ వెనుక‌బ‌డి ఉన్నాడు విరాట్.

స‌న్నీ మొత్తం 34 టెస్ట్ సెంచ‌రీలు చేయ‌గా.. అందులో 11 తాను కెప్టెన్‌గా ఉన్న‌పుడు చేసినవే. ఇక కెప్టెన్‌గా అతి త‌క్కువ ఇన్నింగ్స్‌లో ప‌ది సెంచ‌రీలు చేసిన వారి జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు.

బ్రాడ్‌మ‌న్ 26 ఇన్నింగ్స్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా.. జ‌య‌వ‌ర్ద‌నె (36 ఇన్నింగ్స్‌), స్టీవ్ స్మిత్‌ (37 ఇన్నింగ్స్‌), స్టీవ్ వా (43 ఇన్నింగ్స్‌) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+