భారత్ Vs లంక: రేపటి నుంచి తొలి టెస్టు, విశేషాలివే
హైదరాబాద్: సొంతగడ్డపై ఈ ఏడాది టెస్టు సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా మళ్లీ ఐదు రోజుల టెస్టు ఫార్మెట్‌కు సన్నద్ధమైంది. శ్రీలంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు గాను ఇప్పటికే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అక్కడికి చేరుకుంది.
బుధవారం (జులై 26) నుంచి గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ ఏడాది జనవరిలో ధర్మశాలలో చివరి టెస్టు ఆడిన కోహ్లీసేన, ఆ తర్వాత ఐపీఎల్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండిస్ పర్యటనలో బిజీగా క్రికెట్ ఆడారు.

కోహ్లీ సేన లంక పర్యటనకు ఓ ప్రత్యేకత
ఇదిలా ఉంటే ప్రస్తుతం కోహ్లీ సేన లంక పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే శ్రీలంకపై సిరిస్ విజయంతో కోహ్లీసేన విజయ యాత్రను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఇలా వరుసగా టెస్టు సిరిస్‌లను గెలుచుకుంది.

మొత్తం 7 టెస్టు సిరిస్‌లు
ఇప్పుడు మరోసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు కోహ్లీసేన సన్నద్ధమైంది. అంతేకాదు శ్రీలంకపై చెప్పుకోదగ్గ రికార్డు ఉన్న భారత్, దానిని కొనసాగించాలని గట్టి పట్టుదలగా ఉంది. ఇప్పటివరకు భారత్, శ్రీలంక జట్ల మధ్య 7 టెస్టు సిరిస్‌లు జరగ్గా భారత్ 2 గెలవగా, 3 ఓడింది. మరో 2 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.
21 టెస్టుల్లో భారత్ 6 గెలవగా, 7 ఓడింది
ఇరు జట్ల మధ్య జరిగిన 21 టెస్టుల్లో భారత్ 6 గెలవగా, 7 ఓడింది. మరో 8 డ్రా అయ్యాయి. చివరిసారిగా 2015లో శ్రీలంకలో పర్యటించిన టీమిండియా 2-1తో సిరీస్ గెలుచుకుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో తొలి టెస్ట్‌కు ముందు భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వైరల్ ఫీవర్ కారణంగా ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఈ టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.

తొలి టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం
రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడని, అయితే ముందు జాగ్రత్తగా అతడిని టెస్టు జట్టు నుంచి తప్పించినట్లు బోర్డు వెల్లడించింది. 'రాహుల్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాడు. తొందర్లోనే కోలుకునే అవకాశముంది. ముందస్తు జాగ్త్రతతో వైద్య సిబ్బంది రాహుల్‌ను విశ్రాంతి తీసుకోమ్మని కోరింది' అని బోర్డు తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications