Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్: ఎలైట్ జాబితాలోకి కేఎల్ రాహుల్

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ చెత్త రికార్డుని నమోదు చేశాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు.

మొదటి బంతికే కేఎల్ రాహుల్

మొదటి బంతికే కేఎల్ రాహుల్

శ్రీలంక పేస్ బౌలర్‌ సురంగ లక్మల్‌ వేసిన తొలి బంతికే ఓపెనర్‌ రాహుల్‌ అవుటై నిరాశపరిచాడు. సురంగ లక్మల్ వేసిన బాల్ కాస్త స్వింగ్ అవడంతో వదిలేయడానికి వెళ్లినా అది రాహుల్ గ్లోవ్స్‌ను తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో తొలి బంతికే అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా టెస్టుల్లో మొదటి బంతికే అవుటైన ఏడో భారత బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. టెస్టుల్లో ఇలా సునీల్ గావస్కర్ మూడుసార్లు మొదటి బంతికే అవుటవగా, సుధీర్ నాయక్, డబ్ల్యూవీ రామన్, శివ సుందర్ దాస్, వసీం జాఫర్‌ ఒక్కోసారి చొప్పున తాము ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు.

కోల్‌కతా వేదికగా తొలి టెస్టు

కోల్‌కతా వేదికగా తొలి టెస్టు

తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరి‌స్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి బంతికే ఔటైన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ ఏడో వాడిగా నిలిచాడు. గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో వర్షం పడుతుండటంతో పిచ్ మీద పచ్చిక ఉండటం, ఆకాశం మేఘావృతమై ఉండటంతో లంక పేసర్లకు కలిసి వచ్చింది. దీంతో శ్రీలంక బౌలర్లు చెలరేగారు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పుజారా ఖాతా తెరవడానికే 21 బంతులు తీసుకున్నాడంటే బౌలర్లకు ఎంతగా పిచ్ అనుకూలించిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ధావన్ (8) కూడా ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు లంక బౌలర్‌ లక్మల్‌కే దక్కాయి.

వర్షం పడటంతో నిలిచిన మ్యాచ్

వర్షం పడటంతో నిలిచిన మ్యాచ్

భారత జట్టు స్కోరు 8.2 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి భారత్ 17 పరుగులు ఉన్న సమయంలో మరోసారి వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. వెలుతురు సరిగా లేకపోవడం, చిరు జల్లులు కురవడంతో.. ఆటగాళ్లు మైదానం వీడాల్సి వచ్చింది. వర్షం కారణంగా అప్పటికే రెండుసార్లు నిలిపివేశారు. వర్షం కారణంగా గురువారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన కొంతసేపటికి వెలుతురు లేమి సమస్య కూడా ఎదురవ్వడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆపివేశారు. మైదానాన్ని కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 8, కోహ్లీ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

టెస్టుల్లో మొదటి బంతికే అవుటైన భారత ఆటగాళ్లు:

టెస్టుల్లో మొదటి బంతికే అవుటైన భారత ఆటగాళ్లు:

గవాస్కర్ - 1974, 1983, 1986

సుధీర్ నాయక్ - 1974

డబ్ల్యూవీ రామన్ - 1989

శివ సుందర్ దాస్ - 2001

వసీం జాఫర్‌ - 2007

కేఎల్ రాహుల్ - 2017

Story first published: Thursday, November 16, 2017, 15:49 [IST]
Other articles published on Nov 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+