వందేమాతరం నినాదంతో మార్మోగిన స్టేడియం.. వీడియో చూస్తే గూస్‌బంప్సే!!

గువాహటి: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం రాత్రి జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి వీలు కాలేదు. మూడు సార్లు అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి గం.10.00ల సమయంలో మ్యాచ్ రద్దయింది.

వందేమాతరంతో మారుమోగిపోయిన స్టేడియం:
అయితే మ్యాచ్ ఆలస్య సమయంలో టీమిండియా అభిమానులు మైదానంలో తమ దేశభక్తిని చూపించారు. స్టేడియంలో అభిమానులంతా 'వందేమాతరం.. వందేమాతరం' అంటూ పాట పాడారు. చాలా సమయం ఇలానే చేశారు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'గువాహటి, ఓ అందం' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.

గూస్బంప్స్ వచ్చాయి:
బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో ఎంతోమంది అభిమానులు వీక్షించారు. అంతేకాదు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మ్యాచ్ జరగకున్నా..ఈ వీడియో ఎంతో సంతృప్తినిచ్చింది' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. వీడియో చూస్తుంటే గూస్బంప్స్ వచ్చాయి' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ మంగళవారం ఇండోర్ స్టేడియంలో జరగనుంది.
ఓపికగా ఎదురుచూసారు:
బర్సపర ఫ్లాట్ పిచ్‌తో పాటు బౌండరీల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో భారీ స్కోర్లు ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ వర్షం అభిమానులను నిరాశకు గురిచేసింది. మైదానంలో రాత్రి 10 గంటలకు వారు ఓపికగా ఎదురుచూసారు. గత వారం రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా వర్షం కురిసింది. 2017లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications