Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేడు శ్రీలంకతో భారత్‌ తొలి టీ20.. బుమ్రాపైనే కళ్లన్నీ.. ఒత్తిడిలో ధావన్!!

India Vs Sri Lanka 2020 1st T20i : Match Preview | Focus On Come Back Stars Dhawan & Bhumra!!
India vs Sri Lanka 1st T20I Preview: Where to watch live, team news, possible XI and betting odds

గువాహటి: కొత్త సంవత్సరంలో భారత క్రికెట్‌ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. అదే ఫార్మాట్‌తో బోణీ చేసేందుకు సిద్ధమైంది. గువాహటిలోని బర్సపర స్టేడియంలో ఆదివారం జరిగే తొలి టీ20లో శ్రీలంకతో భారత్‌ తలపడుతుంది. దాదాపు 22 నెలల తర్వాత భారత్‌, లంక జట్లు టీ20ల్లో ఎదురుపడనున్నాయి. 2018 ఆరంభంలో జరిగిన నిదాహస్‌ ట్రోఫీ అనంతరం ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్‌లో పోటీపడలేదు. రికార్డులు, ఫామ్‌, బలాబలాలు పరంగా చూసుకుంటే భారత్‌ ఎంతో ముందుంది. అయితే మరి కొత్త ఏడాదికి విజయంతో స్వాగతం పలికేదెవరో వేచి చూడాల్సిందే.

ఒత్తిడిలో ధావన్:

ఒత్తిడిలో ధావన్:

గత కొంతకాలంగా శ్రీలంకతో సిరీస్‌లకు కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇస్తూ వచ్చిన భారత్‌.. ఈసారి కూడా అదే చేసింది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. దాంతో కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్‌ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గాయాలు, ఫామ్‌లేమితో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ధావన్‌కు ఈ సిరీస్‌ పరీక్షగా నిలవనుంది. ఎందుకంటే రోహిత్‌కు రాహుల్‌ మంచి జోడిగా పేరు సంపాదించాడు. దీంతో రెగ్యులర్‌ ఓపెనర్‌ స్థానానికి పోటీ పెరిగింది. మరి ఇలాంటి కీలక దశలో ధవన్‌ ఎలా ఆడుతాడో చూడాలి.

శాంసన్‌ బెంచ్‌కే పరిమితం

శాంసన్‌ బెంచ్‌కే పరిమితం

వన్‌డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌, రిషబ్ పంత్‌ స్థానాలకు ఢోకాలేదు. అయ్యర్‌-పంత్ విండీస్ సిరీస్‌లో అదరగొట్టారు. అలాంటి ప్రదర్శనే భారత్ మళ్లీ ఆశిస్తోంది. సంజూ శాంసన్‌ వరుసగా ఆరు టీ20 మ్యాచ్‌ల్లో పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో శివమ్ దూబే ఖాయమే. అయితే హార్దిక్ పాండ్యా పునరాగమనం వరకు అతడికి పోటీ లేకున్నా.. ఆ తర్వాత జట్టులో చోటు నిలబెట్టుకోవాలనుకుంటే మంచి ఇన్నింగ్స్‌లు ఆడక తప్పదు.

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లకు చోటు దక్కొచ్చు. ఈ ఇద్దరిని ఆడిస్తే.. కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చాహల్‌లో ఒకరికే తుది జట్టులో చోటుంటుంది. కెరీర్‌ ఆరంభమయ్యాక తొలిసారి సుదీర్ఘ విరామం తీసుకున్న పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో జట్టు బౌలింగ్‌ విభాగం బలంగా మారింది. నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌ కూడా రాణిస్తే తిరుగుండదు.

మలింగ, ఏంజెలోమాథ్యూస్‌పై భారం

మలింగ, ఏంజెలోమాథ్యూస్‌పై భారం

దశాబ్దకాలంగా తమను ప్రతిసారి దెబ్బకొడుతున్న భారత జట్టుపై లంక ఈసారి సమష్టిగా చెలరేగాలనుకుంటోంది. సీనియర్‌, యువ ఆటగాళ్ల కలయికతో ఆ జట్టు సమతూకంతో ఉంది. అయితే టీ20ల్లో లంక ప్రయాణం ఏమంత బాగాలేదు. యువ ఆటగాళ్లు రాజపక్స, గుణతిలక, ఫెర్నాండోలు కీలకం. ఇక కుశాల్‌ పెరీర ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌ లసిత్ మలింగ, ఏంజెలోమాథ్యూస్‌పై కూడా అంచనాలు నెలకొన్నాయి. వన్డే అరంగేట్రంలో హ్యాట్రిక్‌ సాధించిన లెగ్‌ స్పిన్నర్‌ హసరంగపై లంక బౌలింగ్‌ ఆధారపడి ఉంది.

పిచ్‌, వాతావరణం

పిచ్‌, వాతావరణం

2017లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓడింది. ఫ్లాట్‌ పిచ్‌తో పాటు బౌండరీల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో భారీ స్కోర్లు ఖాయం. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. ఆటకు వరుణుడి ముప్పులేదు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, అయ్యర్‌, పంత్‌, దూబే, జడేజా, సుందర్‌, కుల్దీప్‌/చాహల్‌, శార్దూల్‌, బుమ్రా.

శ్రీలంక: మలింగ (కెప్టెన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సా, కుషాల్‌ పెరెరా, మాథ్యూస్‌, షనక, ఉడానా, హసరంగ, లహిరు కుమార/కసున్‌ రజిత.

Story first published: Sunday, January 5, 2020, 10:53 [IST]
Other articles published on Jan 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+