
హైదరాబాద్: కటక్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20ల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. అంతకముందు టీ20 వరల్డ్ కప్‌లో కొలంబోలో ఇంగ్లాండ్‌పై సాధించిన 90 పరుగుల విజయమే ఇప్పటివరకు భారత్‌కు అది పెద్ద విజయం.
భారత్ ఈ విజయం సాధించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలకపాత్ర పోషించాడు. కటక్‌లో బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20లో ధోని చేసిన 39 పరుగులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయి. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ధోని సాధించిన పరుగుల సంఖ్య 1,320కి చేరింది.
దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. తొలి టీ20లో తన అద్భుతమైన కీపింగ్‌తో నలుగురిని పెవిలియన్‌కు చేర్చాడు. భారత్ తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (1,956) అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ (1,502) రెండో స్థానంలో ఉన్నాడు.
కటక్‌లో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ధోని 39 పరుగులు చేయడంతో సురేశ్ రైనా(1,307)ను వెనక్కి నెట్టి మూడో స్ధానంలో నిలిచాడు. దీంతో పాటు తొలి టీ20లో ధోని అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 శుక్రవారం ఇండోర్ వేదికగా జరగనుంది.
తొలి టీ20లో ధోని సాధించిన రికార్డులు:
* టీ20లో 35 కంటే ఎక్కువ పరుగులతో పాటు నాలుగు ఔట్లు చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని అరుదైన గుర్తింపు సాధించాడు. ఈ ఘనతను అంతకముందు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్(రెండు సార్లు), పాకిస్థాన్‌కు చెందిన కమ్రాన్ అక్మల్ ఒకసారి సాధించారు.
* భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో నాలుగు ఔట్లు చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. లంకతో తొలి టీ20లో ధోని రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంప్‌లు చేశాడు.
* నాలుగో స్ధానంలో ధోని బ్యాటింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. 11 ఇన్నింగ్స్‌ల్లో 244 పరుగులు చేశాడు (7సార్లు నాటౌట్‌గా నిలిచాడు). ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఫిబ్రవరి 1, 2017న బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
* టీ20 క్రికెట్లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్‌కీపర్ లేదా ఫీల్డర్‌గా ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 74 ఔట్లలో పాలుపంచుకున్న అతడు డివిలియర్స్ రికార్డు (72)ను అతడు బద్దలు కొట్టాడు.
* నాలుగో స్ధానంలో ధోని బ్యాటింగ్ యావరేజి 135.01 గా ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.