Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: నేడే టీ20 సిరీస్ ఆరంభం..ఫ్రీగా ఎలా చూడాలంటే?

భారత్ మరో సమరానికి సిద్ధమైంది. శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంకపై రికార్డులు, ఫామ్ పరంగా ఛాంపియన్ ఇండియాదే పైచేయి. మరో రెండేళ్ల వరకు టీ20 ఫార్మాట్‌లో మెగా టోర్నీ కూడా లేదు.

కానీ భారత్‌ జట్టులో ఇటీవల భారీ మార్పులు చోటు చేసుకోవడంతో సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. కోచ్‌గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తర్వాత టీమిండియా ఆడే తొలి సిరీస్ ఇదే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, టీ20 వరల్డ్ కప్-2026ల లక్ష్యంగా భారత జట్టును సిద్ధం చేయాలని నయా కోచ్ గంభీర్ భావిస్తున్నాడు.

India vs Sri Lanka 1st T20I Live Streaming How to Watch IND vs SL Match Online and on TV for Free

మరోవైపు శ్రీలంక కూడా తమ జట్టును బలంగా నిర్మించుకోవాలని భావిస్తోంది. సనత్ జయసూర్య కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. హసరంగ తప్పుకోవడంతో జట్టు పగ్గాలు అసలంక తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి లంక అర్హత సాధించలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలిచే ఛాన్స్ లంకకు లేదు. కానీ 2026 టీ20 మెగాటోర్నీలో గర్జించాలని, దానికి తగ్గట్లుగా భారత్ సిరీస్‌తోనే జట్టును సిద్ధంచేసుకోవాలని శ్రీలంక భావిస్తుంది. ఈ నేపథ్యంలో సిరీస్‌పై అంచనాలు పెరిగాయి.

సోనీ నెటవర్క్‌లో లైవ్
టీమిండియా విదేశీ సిరీస్‌లకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ సోనీ లివ్ యాప్‌లో‌ కూడా ఈ మ్యాచ్‌లు రానున్నాయి.

రుసుము చెల్లించకుండా ఫ్రీగా చూడాలంటే?
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనిలివ్ యాప్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. కానీ మొబైల్స్‌లో ఫ్రీగా చూడాలనుకుంటే జియోటీవీ యాప్ నుంచి చూడవచ్చు. ఈ యాప్‌లో ఛానెల్స్‌లో... సోనీ టీవీ నెట్ వర్క్ ఛానెల్స్‌ను ఎంపిక చేసుకోని భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని ఉచితంగా చూడవచ్చు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Story first published: Saturday, July 27, 2024, 11:13 [IST]
Other articles published on Jul 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+