For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో తొలి టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్!!

India vs Sri Lanka 1st T20I: India have won the toss and have opted to field

గువాహటి: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో మరికొద్ది సేపట్లో ప్రారంభం అయ్యే తొలి టీ20లో శ్రీలంకతో భారత్‌ తలపడుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాండే, శాంసన్, చాహల్, జడేజా ఈ మ్యాచ్ ఆడడం లేదు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు లంక కూడా ఐదుగురు బౌలర్లతో ఆడనుంది.

ఈ మ్యాచ్‌ గెలిచి ఏడాదిని విజయోత్సవంతో ప్రారంభించాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు లంక కూడా బోణీ కోసం చూస్తోంది. అయితే మరి కొత్త ఏడాదికి విజయంతో స్వాగతం పలికేదెవరో వేచి చూడాల్సిందే. రెండు జట్ల బలాబలాలు చూసినైట్లెతే, అన్ని విభాగాల్లోనూ కోహ్లీసేన బలంగా ఉంది. దాదాపు 22 నెలల తర్వాత భారత్‌, లంక జట్లు టీ20ల్లో ఎదురుపడనున్నాయి. 2018 ఆరంభంలో జరిగిన నిదాహస్‌ ట్రోఫీ అనంతరం ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్‌లో పోటీపడలేదు.

బర్సపర ఫ్లాట్‌ పిచ్‌తో పాటు బౌండరీల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో భారీ స్కోర్లు ఖాయం. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. స్పిన్నర్లకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఉదయం ఆకాశం మేఘావృతంగా ఉంది. అయితే ఆటకు వరుణుడి ముప్పులేదు. 2017లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓడింది.

Teams:
Sri Lanka (Playing XI): Danushka Gunathilaka, Avishka Fernando, Kusal Perera(w), Oshada Fernando, Bhanuka Rajapaksa, Dhananjaya de Silva, Dasun Shanaka, Isuru Udana, Wanindu Hasaranga, Lahiru Kumara, Lasith Malinga(c).

India (Playing XI): Shikhar Dhawan, Lokesh Rahul, Virat Kohli(c), Shreyas Iyer, Rishabh Pant(w), Shivam Dube, Washington Sundar, Kuldeep Yadav, Shardul Thakur, Navdeep Saini, Jasprit Bumrah

Story first published: Sunday, January 5, 2020, 18:49 [IST]
Other articles published on Jan 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+