మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. ఒక్కబంతి పడకుండగానే తొలి టీ20 రద్దు!!

గువాహటి: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గువాహటిలోని బర్సపర స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ప్రారంభం అవడానికి వీలు కాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 ఇండోర్ వేదికగా మంగళవారం జరగనుంది. ఇక చివరిదైన మూడో మ్యాచ్‌కు జనవరి 10న పుణె వేదిక కానుంది.

అరగంటకు పైగా వర్షం:
మ్యాచ్ 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండగా.. అరగంట ముందు (6:30 గంటలకు) టాస్ వేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక మ్యాచ్‌కు కాసేపటి ముందే వర్షం ప్రారంభమైంది. అరగంటకు పైగా ఏకధాటిగా వర్షం కురవడంతో పిచ్ తడిసిపోయింది. మైదానం సిబ్బంది తేమ తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలూ చేసినా పరిస్థితిలో మార్పు కనపడలేదు. మధ్యలో మరొకసారి వర్షం పడగా.. పిచ్, అవుట్ ఫీల్డ్‌లు చిత్తడిగా మారిపోయాయి.

5 ఓవర్ల మ్యాచ్ సాధ్యం కాలేదు:
వర్షం ఆగాక పిచ్‌ను ఆరబెట్టడానికి గ్రౌండ్‌మెన్ కష్టపడ్డప్పటికీ.. చివరకు పిచ్‌ను సిద్ధం చేయడంలో విఫలమయ్యారు. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిపించాలని చూసినా అది కూడా సాధ్యం కాలేదు. మొత్తంగా మూడు సార్లు అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి గం.10.00ల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మ్యాచ్ వర్షం పడితే పిచ్‌ను త్వరితగతిన సిద్ధం చేసే సాధ్యమైనన్ని వనరులు అసోం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) వద్ద లేవనే విషయం మరోసారి బయటపడింది.
గత వారం రోజులుగా
బర్సపర ఫ్లాట్ పిచ్‌తో పాటు బౌండరీల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో భారీ స్కోర్లు ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ వర్షం అభిమానులను నిరాశకు గురిచేసింది. మైదానంలో రాత్రి 10 గంటలకు వారు ఓపికగా ఎదురుచూసారు. గత వారం రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆకాశం మేఘావృతంగా ఉంది. అయితే ఆటకు వరుణుడి ముప్పులేదని చెప్పారు. అనూహ్యంగా వరణుడు ప్రత్యక్షమయ్యాడు. 2017లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఓడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications