Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: కుల్దీప్ యాదవ్ మాయాజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు!!

India vs Sri Lanka 1st ODI: Kuldeep Yadav removes Bhanuka Rajapaksa, Minod Bhanuka in same over

కొలంబో: ప్రేమదాస మైదానంలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. 85 పరుగుల వద్ద భనుక రాజపక్స (24)ను వెనక్కి పంపిన కుల్దీప్.. ఆ తర్వాత కాసేపటికే (89) మినోద్ భానుక (27)ను పెవిలియన్ పంపాడు. 44 బంతులు ఎదుర్కొన్న మినోద్ 3 ఫోర్లతో 27 పరుగులు చేయగా, రాజపక్స 22 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (13), చరిత్ అసలంక (12) క్రీజులో ఉన్నారు.

కొలంబోలోని ప్రేమదాస మైదానంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. లంక ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో (32), మినోద్ భానుక ఆచితూచి ఆడారు. భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొని మంచి ఆరంభం ఇచ్చారు. యజ్వేంద్ర చహల్‌ వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికి ఫెర్నాండో ఔటయ్యాడు. కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడబోయిన ఫెర్నాండో.. మనీష్‌ పాండేకు నేరుగా క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అది చహల్‌ తొలి ఓవర్‌ కాగా.. వేసిన తొలి బంతికే వికెట్‌ తీయడం విశేషం. 10 ఓవర్లు ముగిసేసరికి లంక వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది.

ఆపై మినోద్ భానుక, భనుక రాజపక్స లంక ఇన్నింగ్స్‌ను ముందుకునడిపారు. అయితే కుల్దీప్ యాదవ్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ తొలి బంతికి భానుక రాజపక్సా పెవిలియన్‌కు చేరాడు. మిడాన్‌లో శిఖర్ ధావన్ క్యాచ్‌ పట్టడంతో రాజపక్సా ఔటయ్యాడు. అనంతరం మినోద్‌ భానుకా కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. కుల్దీప్‌ వేసిన అదే ఓవర్​ నాల్గో బంతికి మినోద్‌ స్లిప్‌లో పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో లంకేయులు 89 పరుగులు వద్ద మూడో వికెట్‌ను నష్టపోయారు.

Story first published: Sunday, July 18, 2021, 17:35 [IST]
Other articles published on Jul 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+