For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

112 స్కోరుతో చిత్తుగా ఓడిన భారత్: ధోనీ ఒక్కడే 65

India vs Sri Lanka, 1st ODI, Dharamsala – Live Score, Live Streaming, Cricket Updates

హైద‌రాబాద్‌: ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన శ్రీలంక‌, భార‌త్‌ల మ‌ధ్య జ‌రిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంక భారీ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు నష్టపోయి 20.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (49; 46 బంతుల్లో 10×4) అద్భుతంగా ఆడాడు. ఏంజెలో మాథ్యూస్‌ (25; 42 బంతుల్లో 5×4), నిరోషన్‌ డిక్వెలా (26; 24 బంతుల్లో 5×4) అజేయంగా నిలిచారు. బుమ్రా, భువి, పాండ్య తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు భారత్‌లో ధోనీ (65; 87 బంతుల్లో 10×4, 2×6) అర్ధశతకం బాదాడు.

మ్యాచ్ స్కోరు కార్డు

ఒక్క‌డే 65
ఓపెన‌ర్‌గా దిగి డ‌కౌట్ అయిన శిఖ‌ర్ ధావ‌న్‌తో మొద‌లై కుల్‌దీప్ యాద‌వ్ వర‌కు ఔట్ల ప‌రంప‌ర సాగింది. వ‌రుస‌గా రాలిపోతున్న వికెట్ల‌ను కుల్‌దీప్ యాద‌వ్ కొంత వ‌ర‌కు ఆపి 19 స్కోరు సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మన్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఒక్క‌డే క్రీజులో నిల‌బ‌డి 100వ‌ర‌కు కూడా వెళ్ల‌దు అనుకున్న స్కోరును 112 వ‌ర‌కు తీసుకెళ్లాడు. జ‌స్ప్రిత్ బుమ్రా, ధోనీకి మంచి భాగ‌స్వామ్యాన్ని అందించాడు. 87 బంతుల్లో 65ప‌రుగులను చేసి ఎలాగైతే టీమిండియాను వంద దాటించాడు.

రెచ్చిపోయిన శ్రీలంక‌
సురంగ ల‌క్మ‌ల్ ప‌ది ఓవ‌ర్ల బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. నువాన్ ప్ర‌దీప్ రెండు వికెట్లు తీయ‌గా మిగిలిన న‌లుగురు ఒక్కొక్క‌టి చొప్పున తీశారు. టెస్ట్ సిరీస్ ప‌రాజ‌యం త‌ర్వాత శ్రీలంక టీం మంచి దూకుడుతోనే వ్య‌వ‌హ‌రిస్తోంది.

భార‌త్‌: రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్‌), శిఖ‌ర్ ధావ‌న్‌, అజింకా ర‌హానే, శ్రేయాస్ అయ్య‌ర్‌, మ‌త్‌కునీశ్ పాండే, కేద‌ర్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, ఎంఎస్ ధోనీ(వికెట్ కీప‌ర్‌), హ‌ర్ధిక్ పాండ్యా, అక్స‌ర్ ప‌టేల్‌, కుల్‌దీప్ యాద‌వ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, జాస్ప్రిత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌, సిద్దార్థ్ కౌర్‌

శ్రీలంక‌: తిసారా పెరేరా (కెప్టెన్‌), ఉప్ప‌ల్ త‌రంగ‌, ద‌నుష్క గుణ‌తిల‌క‌, లాహిరు తిరిమ‌న్నె, ఏంజి మాథ్యూస్‌, గుణ‌ర‌త్నె, నిరోషాన్ దిక్వెల్లా, చ‌తురంగ దె సెల్వా, అకిలా ద‌నంజ‌య‌, సురంగ ల‌క్మ‌ల్‌, నువాన్ ప్ర‌దీప్‌, స‌దీరా స‌మ‌ర‌విక్ర‌మం, ధ‌నంజ‌య దే సెల్వా, దుష్మంత చ‌మీరా, స‌చిత్ ప‌తిరానా, కుస‌ల్ పెరేరా

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 11, 2017, 10:55 [IST]
Other articles published on Dec 11, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+