For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో మూడో టీ20: ప్రయోగాలు చేస్తారా, మ్యాచ్ ప్రత్యేకతలివే!

By Nageshwara Rao
15 Reasons to Watch the 3rd T20I in Mumbai

హైదరాబాద్: మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, శ్రీలంక పరువు కోసం ప్రయత్నిస్తోంది. సిరీస్‌ ఫలితం తేలిపోవడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిరిస్‌లో బసిల్‌ థంపి, దీపక్‌ హుడా అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.

India whitewash Sri Lanka in T20s, Man of the Match Jaydev Unadkat feels confident

మరోవైపు శ్రీలంకతో వన్డే సిరిస్‌లో అరంగేట్రం చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ టీ20ల్లో సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నాడు. ఇక, ఇద్దరు స్పిన్నర్ల స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ లేదా హుడాలలో ఎవరినో ఒకరితో భర్తీ చేయవచ్చు. ఇక పేసర్ ఉనద్కట్‌ను తుది జట్టు నుంచి తొలగిస్తే థంపికి అవకాశం రావొచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా.

మ్యాచ్‌కు ముందే లంకకు దెబ్బ:

ఇప్పటికే టెస్టు, వన్డే, టీ20 సిరిస్‌ను పొగొట్టుకున్న శ్రీలంక కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. మూడో టీ20కి ముందే శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ మజిల్స్‌ పట్టుకోవడంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. . దీంతో బ్యాటింగ్‌ భారమంతా ఓపెనర్ ఉపుల్‌ తరంగపై పడనుంది.

రెండో టీ20లో కుశాల్‌ పెరీరా రాణించడంతో అతడిపై లంక అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మూడో టీ20లో కూడా అతడి నుంచి అలాంటి ఇన్నింగ్స్‌నే శ్రీలంక ఆశిస్తోంది. భారత పర్యటనలో శ్రీలంక బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. మరి, ఈ మ్యాచ్‌లో ఎలా వేస్తారో చూడాలి.

ఈ మ్యాచ్‌కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం:

* వాంఖడెలో ఇప్పటివరకు జరిగిన రెండో టీ20ల్లో భారత్ ఓటమి పాలైంది.
* ఈ ఏడాది టీ20లకు ఆతిథ్యమిస్తోన్న 11వ వేదిక వాంఖడె స్టేడియం
* జనవరి 1, 2016 నుంచి స్వదేశంలో భారత్ ఆడిన 19వ టీ20 ఇది.
* 6/6 - శ్రీలంకతో జరిగిన గత ఆరు టీ20ల్లో భారత్ విజయం సాధించింది.
* టీ20 ఫార్మాట్‌లో శ్రీలంక వరుసగా 7 టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
* 8 - భారత్-శ్రీలంక జట్ల మధ్య భారత్ ‌ జరగుతున్న 8వ టీ20 ఇది. ఇందులో 5-2తో టీమిండియా ఆధిక్యంలో ఉంది.
* ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్ రికార్డుని బద్దలు కొట్టడానికి చైనామన్ యజువేంద్ర చాహల్‌కు మరో వికెట్ కావాలి. 2016లో జరిగిన టీ20ల్లో అశ్విన్ 23 వికెట్లు తీశాడు. ఈ ఏడాది చాహల్ కూడా 23 వికెట్లు తీయడం విశేషం.
* టీ20ల్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ యావరేజి 10.71. ఈ ఏడాది 150 పరుగులు చేసిన పాండ్యా 14 సార్లు ఔటయ్యాడు. స్ట్రయిక్ రేట్ 130.43గా ఉంది.

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 24, 2017, 17:47 [IST]
Other articles published on Dec 24, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+