India vs Southafrica: నాలుగో టీ20కి ముందు ప్లేయర్లను ఊరిస్తున్న రికార్డులివే..!

దక్షిణాఫ్రికాతో సిరీస్లో తొలి రెండు టీ20ల్లో ఓడిపోయిన భారత్.. విశాఖపట్నంలో జరిగిన మూడో మ్యాచ్‌లో ప్రోటీస్‌పై 48పరుగుల తేడాతో విజయం సాధించి పుంజుకుంది. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాటు బౌలింగ్లో హర్షల్ పటేల్ 4, యుజ్వేంద్ర చాహల్ 3వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. ఇక ఈ విజయం తర్వాత సిరీస్ ఓడిపోకుండా 2-1తేడాతో ఇండియా సజీవంగా ఉంది. ఇక శుక్రవారం జూన్ 17న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నాలుగో మ్యాచ్ జరగనుంది.

ఎలాగైనా గెలిచి 2-2తో సమం చేయాలని
ఇక ఈ మ్యాచ్‌లో చేతి గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన క్వింటన్ డికాక్ ఫిట్‌గా ఉంటే రీజా హెండ్రిక్స్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇకపోతే గత మ్యాచ్ ప్లేయింగ్ 11నే టీమిండియా కొనసాగించే అవకాశముంది. ఇక బెంచ్ మీద ఉన్న ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ తమ అరంగేట్రం కోసం వేచి ఉండాల్సి రావొచ్చు. అయితే అవేశ్ ఖాన్ గాయపడడంతో నాలుగో టీ20లో అతను ఆడడం డౌటే. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటి వరకు జరిగిన మూడు టీ20లలోనూ అవేశ్ ఖాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నాలుగో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రిషబ్ పంత్ సేన సిరీస్‌ను 2-2తో సమం చేయాలని చూస్తుంది.

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా హెడ్ టు హెడ్
ఇకపోతే టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు 18 టీ20మ్యాచ్‌లు జరగగా.. ఇందులో భారత్ 10, దక్షిణాఫ్రికా 8మ్యాచ్‌లలో గెలిచాయి. భారతదేశంలో.. ఇరు జట్లు ఏడు సార్లు తలపడగా.. భారత్ 2సార్లు గెలవగా, ఐదు సార్లు ప్రోటీస్ జట్టు గెలిచింది. ఇదిలా ఉండగా.. భారతదేశం మరియు దక్షిణాఫ్రికా మధ్య 4వ T20Iకి ముందు కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు ప్లేయర్లు చేరుకునే వీలుంది. అవేంటో ఒకసారి చూద్దాం.

ప్లేయర్లు చేరుకునే వీలున్న మైలురాళ్లు
ఒక సిక్సర్ - రిషబ్ పంత్ టీ20 ఫార్మాట్‌లలో 100 సిక్సుల మార్క్ చేరుకోవడానికి కేవలం ఒక్క సిక్స్ దూరంలో ఉన్నారు.
64పరుగులు - దినేష్ కార్తీక్ ఇంటర్నేషనల్ టీ20లలో 500పరుగులకు చేరుకోవడానికి ఇంకా 64పరుగులు చేయాలి.
4 వికెట్లు- జస్ప్రీత్ బుమ్రా (67వికెట్లు)ను అధిగమించడానికి భువనేశ్వర్ మరో నాలుగు వికెట్లు సాధించాలి. ప్రస్తుతం భువీ 64వికెట్లతో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ఒక క్యాచ్ - క్వింటన్ డికాక్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో 50క్యాచ్‌లను చేరుకోవడానికి ఒక క్యాచ్ దూరంలో ఉన్నాడు.
ఒక వికెట్ - టీ20 ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి అక్షర్ పటేల్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.
8 ఫోర్లు - డి కాక్ అంతర్జాతీయ టీ20లో 200ఫోర్లు పూర్తి చేయడానికి ఇంకా ఎనిమిది ఫోర్లు బాదాలి.
4 ఫోర్లు - అంతర్జాతీయ క్రికెట్‌లో 250ఫోర్లు సాధించాలంటే రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ (246)కు నాలుగు ఫోర్లు అవసరం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications