డీకే అంటే డిసాస్టర్ అనుకుంటిరా.. డిసైడరూ..! దినేష్ కార్తీక్ ఇన్సింగ్స్ పట్ల ట్విట్టర్లో హల్‌చల్

దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం రాజ్‌కోట్‌లో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో ఫినిషర్ దినేష్ కార్తీక్ (55పరుగులు 27బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) చివర్లో తనదైన స్టైల్లో ఫినిషింగ్ నాక్ ఆడడంతో 20ఓవర్లకు ఇండియా 6వికెట్లు కోల్పోయి 169పరుగుల స్కోరు చేయగలిగింది. చప్పగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను.. దినేష్ కార్తీక్ ఘాటుగా మార్చేశాడు. సిక్సులు, ఫోర్లతో దినేష్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టీ20 ఇంటర్నేషనల్లో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతను హిట్టింగ్ చేస్తున్న టైంలో డీకే.. డీకే.. డీకే.. అంటూ ప్రేక్షకులు స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక డీకే ఇన్నింగ్స్ పట్ల నెట్టింట్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాకు సరైన ఫినిషర్ దొరికేశాడు అంటూ కామెంట్లొస్తున్నాయి. ఇక 2006లో టీ20లో అరంగేట్రం చేసిన డీకే.. 2022లో హాఫ్ సెంచరీ చేశాడు. అంటే 16ఏళ్లకు అతను తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా నెవర్ గివప్ ఇన్ లైఫ్ అనే గొప్ప సందేశాన్ని చాటాడు.
ట్రబుల్ టైంలో బరిలోకి దిగి..
81పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా.. ఇక 140దాటితే చాలు అనేలా కన్పించింది. క్రీజులో హార్దిక్ పాండ్యా కాస్త తడబడుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పటికే పంత్, శ్రేయస్ అయ్యార్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లను తక్కువ తక్కువ స్కోర్లకే దక్షిణాఫ్రికా బౌలర్లు ఔట్ చేయడంతో పిచ్ కాస్త కఠినంగా ఉందని అర్థమైంది. ఈ క్రమంలో 140వరకు ఇండియా లాగితే.. ఇండియాకు ఎడ్జ్ ఉంటుందనిపించింది. కానీ ఫినిషర్ దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటివరకు దూకుడు కొనసాగించిన దక్షిణాఫ్రికా బౌలర్ల లయను అతను దెబ్బతీశాడు.
15ఓవర్లో మొదలెట్టాడు
15వ ఓవర్లో దినేష్ కార్తీక్ ఫోర్ కొట్టి తన హిట్టింగ్ మొదలెట్టాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి దినేష్ కార్తీక్ 65పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. నార్జ్ వేసిన 16వ ఓవర్లో దినేష్ కార్తీక్ రెండు ఫోర్లు, 17వ ఓవర్లో కేశవ్ మహారాజ్ బౌలింగ్లో మూడు ఫోర్లు, 18వ ఓవర్ ప్రిటోరియస్ వేయగా. ఆ ఓవర్లో 6, 4, 4 కొట్టి దినేష్ కార్తీక్ తన పవరేంటో చూపించాడు. ఆ ఓవర్లో 16పరుగులొచ్చాయి. 19వ ఓవర్లో ఒక ఫోర్ కొట్టిన దినేష్.. చివరి ఓవర్లో సిక్స్ కొట్టి టీ20లో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2బంతికి హిట్ చేసినప్పటికీ వాన్ డర్ డుస్సెన్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు. దినేష్ కార్తీక్ దూకుడుకు చివరి అయిదు ఓవర్లలో 73పరుగులొచ్చాయి. దీంతో 140అనుకున్న స్కోరు 169పరుగులు చేరుకుంది. తద్వారా టీమిండియా 170పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ ముందుంచింది. ఇక బౌలింగ్లో అవేశ్ ఖాన్ 4/18తో చెలరగేడంతో దక్షిణాఫ్రికా 87పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా ఇండియా 82పరుగులతో గెలుపొందింది.
ట్విట్టరులో డీకేకు ప్రశంసల జల్లు
టీమిండియా ట్రబుల్లో ఉన్నప్పుడు వచ్చి దక్షిణాఫ్రికాకు ట్రబుల్ గా మారాడంటూ ట్విట్టర్లో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. 2006లో టీ20లో డీకే అరంగేట్రం చేసినప్పటికీ అతనికి సరైన అవకాశాలైతే రాలేదు. ఇక 16ఏళ్ల తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. ఇక తన కమ్ బ్యాక్ తర్వాత అతను కచ్చితంగా నెవర్ గివ్ అప్ అనే క్యాప్షన్‌కు సరితగ్గ వాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఇటీవల వైజాగ్ నుంచి బయలుదేరిన ప్లైట్లో స్ప్రే మధ్యలో నుంచి దినేష్ కార్తీక్ హీరోలా నడుచుకుంటూ వస్తున్న వీడియోను ఓ నెటిజన్ రిట్వీట్ చేస్తూ.. వెల్ కమ్ బ్యాక్ దినేష్ కార్తీక్ అంటూ నేటి ఇన్నింగ్స్ తో ముడిపెట్టాడు.
ఒరే పిల్లి బిత్రి నాయల్స్.. అంటూ
ఇక మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం దినేష్ కార్తీక్ తన స్టోరీని తానే తిరగరాసుకుంటున్నాడంటూ కొనియాడాడు. మరో నెటిజన్ దినేష్ కార్తీక్ ను పుష్పతో పోల్చుతూ.. విమర్శకులు గతంలో అతన్నో డిసాస్టర్ (ఫెయిల్యూర్ క్రికెటర్) అని అనుకున్నారని, కానీ అతను డిసాస్టర్ కాదు.. డిసైడర్ (మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ప్లేయర్) అని పేర్కొనేలా ఒరే పిల్లి బిత్రి నాయల్స్ అని విమర్శకులు, హేటర్స్‌ను ఉద్దేశించి ట్వీట్ కొనసాగించాడు. ఇక క్రికెట్ ప్రముఖులు, అభిమానులు టీ20 వరల్డ్ కప్‌లో జట్టుకు ఫినిషర్ రోల్‌లో డీకేను సెలెక్ట్ చేయాలంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications