India vs Southafrica 4th t20: అట్లుంటది డీకేతోనీ.. టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ, ప్రోటీస్ ముందు మంచి టార్గెట్

దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం రాజ్ కోట్‌లో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో ఫినిషర్ దినేష్ కార్తీక్ (55పరుగులు 27బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) వీరబాదుడుకు చివరి 5ఓవర్లలో ఇండియా 73పరుగులు చేయడంతో 20ఓవర్లకు ఇండియా 6వికెట్లు కోల్పోయి 169పరుగుల స్కోరు చేయగలిగింది. ఒకానొక దశలో చప్పగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను.. మసాలా యాడ్ చేసినట్లు దినేష్ కార్తీక్ ఘాటైన సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను బ్యాటింగ్ చేస్తుంటే స్టేడియంలో డీకే.. డీకే.. డీకే.. అంటూ ప్రేక్షకులు హోరెత్తించారు. ఇక డీకేకు తోడు హార్దిక్ పాండ్యా (46పరుగులు 31బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) బాధ్యతాయుత్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఆదిలోనే రెండు వికెట్లు..
ఇకపోతే ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని రిషబ్ పంత్ సేన ఆశించి బ్యాటింగ్‌కు దిగింది. అయితే బ్యాటింగ్లో ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5పరుగులు) రెండో ఓవర్లోనే కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 3వ ఓవర్లో శ్రేయస్ అయ్యార్ (4పరుగులు) సైతం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మార్కో జాన్సేన్ బౌలింగ్లో ఎల్బీడబ్లూ కాగా.. తొలుత ఎంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా రివ్యూ తీసుకోవడంతో శ్రేయస్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27పరుగులు 26బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్) అడపాదడపా ఫోర్లు బాదుతూ స్కోరుబోర్డును కాస్త నడిపించాడు.

మళ్లీ అదే రీతిలో ఔటయిన రిషబ్ పంత్
7వ ఓవర్లో నార్జ్ వేసిన తొలి బంతికి ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. క్రీజులో కెప్టెన్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఉన్నారనే ధీమా చాలా సేపు నిలవలేదు. కెప్టెన్ రిషబ్ పంత్ (17పరుగులు 23బంతుల్లో) మరోసారి నిర్లక్ష్యకరమైన షాట్ ఆడి ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ వేసిన వైడ్ ఆఫ్ స్టంప్ బంతికి హిట్ చేసి క్యాచ్ ఔటయ్యాడు. ఇలా పంత్ ఔటవ్వడం ఇది రెండోసారి. 81పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను హార్దిక్ పాండ్యా, ఫినిషర్ దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. 15వ ఓవర్లో దినేష్ కార్తీక్ ఫోర్ కొట్టి తన హిట్టింగ్ మొదలెట్టాడు.

హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ కలిసి 65పరుగుల భాగస్వామ్యం
నార్జ్ వేసిన 16వ ఓవర్లో దినేష్ కార్తీక్ రెండు ఫోర్లు, హార్దిక్ 1ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 15పరుగులొచ్చాయి. 17వ ఓవర్లో కేశవ్ మహారాజ్ వేయగా మూడు ఫోర్లు బాదిన కార్తీక్ ఆ ఓవర్లో 13పరుగులు పిండుకున్నాడు. 18వ ఓవర్ ప్రిటోరియస్ వేయగా.. 6, 4, 4 కొట్టి దినేష్ కార్తీక్ తన పవరేంటో చూపించాడు. ఆ ఓవర్లో 16పరుగులొచ్చాయి. 19వ ఓవర్ తొలిబందికి సిక్స్ కొట్టిన హార్దిక్ తర్వాతి బంతికి షమ్సీ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. ఇక చివరి ఓవర్లో సిక్స్ కొట్టిన కార్తీక్ టీ20లో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2బంతికి హిట్ చేసినప్పటికీ వాన్ డర్ డుస్సెన్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు. చివరి బంతికి అక్షర్ పటేల్ (8పరుగులు 4బంతుల్లో నాటౌట్) ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో పరుగులొచ్చాయి. తద్వారా 169పరుగులు చేసిన టీమిండియా.. 170పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ ముందుంచింది.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w/c), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):
టెంబా బావుమా (c), క్వింటన్ డి కాక్ (WK), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications