
అందుకే అర్షదీప్ సింగ్ మిస్సయ్యాడు
ఇకపోతే ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. 'మేము ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా ఎక్కువ స్కోరింగ్ గ్రౌండ్. మా ముందు ఉన్న లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం ఉత్తమం. ఈ మ్యాచ్‌లో పిచ్ పెద్దగా మారదని నేను భావిస్తున్నాను.
మా జట్టు తరఫున మూడు మార్పులు జరిగాయి. రోహిత్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ మిస్సయ్యారు. అర్షదీప్ సింగ్‌కు వెన్ను గాయమైంది. అయితే అది అంత పెద్ద సమస్యేం కాదు. కానీ ముందు జాగ్రత్తగా అతన్ని తప్పించాం. శ్రేయాస్ అయ్యర్, ఉమేష్ యాదవ్, సిరాజ్‌లను తుది జట్టులో ఆడిస్తున్నాం. మేము మమ్మల్ని మేం సవాలు చేసుకుంటూ.. బ్యాటింగ్ బాగా చేయాలనుకుంటున్నాం.' అని రోహిత్ అన్నాడు.

ఏమి చేయాలో కచ్చితంగా తెలియడం లేదు
టాస్ ఓడిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడుతూ.. ఈ రోజు ఏమి చేయాలో మాకు కచ్చితంగా తెలియట్లేదు. టాస్ ఓడిపోవడం గురించి పెద్దగా కంగారు పడట్లేదు. కానీ ఓ కెప్టెన్‌గా నేను ఆడాల్సిన విధంగా ఆడట్లేదు. ఈ రోజు నేను నా నుంచి జట్టుకు మంచి ప్రదర్శన ఇస్తానని ఆశిస్తున్నా. ఇప్పటికే సిరీస్ మేం కోల్పోయాం. కానీ ప్రపంచ కప్‌కు ముందు కొన్ని విషయాలను చూసుకోవడానికి మాకు ఇది చివరి అవకాశం. ఈ రోజు మా జట్టులో ఒక మార్పు చేస్తున్నాం. నార్జ్ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ జట్టులోకి వచ్చాడు.

ఇరు జట్లు
దక్షిణాఫ్రికా ( ప్లేయింగ్ XI ): టెంబా బావుమా (కెప్టెన్ ), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రోసౌ, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎన్‌గిడి
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications












