India vs Soutahfrica 1st ODI : అదే మా కొంపముంచింది.. ఓటమికి ధావన్ చెప్పిన కారణాలివే

భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 40ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 249పరుగులు చేసింది. ఇక 250పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 9పరుగుల తేడాతో ఓటమి పాలయింది. టాపార్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలం కాగా..
శ్రేయస్ అయ్యార్ (50 పరుగులు 37బంతుల్లో 8ఫోర్లు) ఫిఫ్టీతో అలరించాడు. ఇక సంజూ శాంసన్ (86పరుగులు 63బంతుల్లో 9ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్) వీరోచితంగా పోరాడగా.. శార్దూల్ ఠాకూర్ (33పరుగులు 31బంతుల్లో 5ఫోర్లు ) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8వికెట్లు కోల్పోయి 40ఓవర్లలో 240పరుగులు చేయగలిగింది. తద్వారా విజయానికి 9పరుగుల దూరంలో ఆగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 2, లుంగి ఎంగిడి 3, పార్నెల్, మహరాజ్, షమ్సీ తలా ఓ వికెట్ తీశారు. షమ్సీ తన 8ఓవర్లలో ఏకంగా 89పరుగులు ఇవ్వడం గమనార్హం.

అంతకుముందు మిల్లర్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు
టాస్ గెలిచిన ధావన్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (48పరుగులు 54బంతుల్లో 5ఫోర్లు) ఆకట్టుకోగా.. డేవిడ్ మిల్లర్ (75పరుగులు 63బంతుల్లో 5ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (74పరుగులు 65బంతుల్లో 6ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్) హాఫ్ సెంచరీలతో కడవరకు నిలిచి జట్టు స్కోరును 249కి తీసుకెళ్లారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, అరంగేట్ర బౌలర్ రవి బిష్ణోయ్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. భారత బౌలర్లు మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేయాల్సింది. ఇక ఫీల్డింగ్ విషయంలోను రెండు మూడు క్యాచ్‌లు మిస్ చేశారు.

ఎక్కువ పరుగులిచ్చాం
ఓటమి అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ' జట్టులోని కుర్రాళ్లు ఇలాంటి అసాధారణ పోరాట పటిమను కనబర్చినందుకు చాలా గర్వంగా ఉంది. అయితే మాకు ఛేదనలో సరైన ఆరంభం లభించలేదు. అదే మా కొంపముంచింది. ఇక శ్రేయాస్ అయ్యార్, సంజూ శాంసన్, శార్దూల్ థాకూర్ ఛేదనలో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి పోరాటం జట్టుకు చాలా ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అయితే బౌలింగ్లో మేము స్వింగ్, స్పిన్‌కు అనుకూలించే ఈ వికెట్‌పై చాలా ఎక్కువ పరుగులిచ్చాం. మా ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా లేదు.. ఏదేమైనా ఈ ఓటమి మాకు మంచి అనుభవాన్నిస్తుంది.' అని ధావన్ పేర్కొన్నాడు.

ఇరు జట్లు:
భారత్ ( ప్లేయింగ్ XI ): శిఖర్ ధావన్ ( కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications