Ind vs Sa 1st ODI : టాస్ మనదే.. అందుకే బౌలింగ్ ఎంచుకున్న ధావన్, 40ఓవర్లకు కుదింపు.. రుతురాజ్ అరంగేట్రం

లక్నో: భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరగనున్న తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేయాల్సి ఉండగా.. వర్షంతో మైదానం తడిసిపోవడంతో అంతరాయం కలిగింది. మధ్యాహ్నం 3.30కు టాస్ వేశారు. ఇక మ్యాచ్ 3.45కు ప్రారంభమైంది. ఈ సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగుతుంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు చేరుకోగా.. ధావన్ సేన లక్నో వేదికగా జరగనున్న తొలి వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది.

వారికి అరంగేట్ర అవకాశం దక్కలేదు
ఈ మ్యాచ్‌లో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక రజత్ పటీదార్, షెహ్‌బాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి, ముఖేష్ కుమార్‌లకు మాత్రం అరంగేట్ర అవకాశం దక్కలేదు. ఇక ఈ మ్యాచ్ టాస్ గెలిచిన శిఖర్ ధావన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతరాయం కారణంగా.. ఆటను 40ఓవర్లకు కుదించారు. ఇక ఒక్కో బౌలర్ గరిష్టంగా 8ఓవర్లు వేసే వీలుంటుంది. తొలి పవర్‌ప్లే 8ఓవర్ల వరకు, 2వ పవర్‌ప్లే 4 ఓవర్లు. 3వ పవర్‌ప్లే 8 ఓవర్లుగా ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 11 దాటొచ్చు.

అందుకే బౌలింగ్ ఎంచుకున్నా..
ఇక టాస్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. మేము ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకున్నాం. వికెట్‌పై కొంచెం తేమ ఉంది. మేము దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. మా జట్టులో ఆరుగురు బ్యాటర్లు మరియు అయిదుగురు బౌలర్లు ఆడుతున్నారు. రుతురాజ్ ఈరోజు వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇద్దరు స్పిన్నర్లను, ముగ్గురు పేసర్లను తీసుకున్నాం. అని పేర్కొన్నాడు.

మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం.. కానీ
టెంబా బావుమా మాట్లాడుతూ.. మేము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మాకు బ్యాటింగ్ విషయంలో కొంచెం మెరుగుదల అవసరం. మొదటి కొన్ని ఓవర్లు కాస్త జాగ్రత్తగా ఆడాలి. అలాగే మొన్నటిదాకా టీ20లు ఆడాం. అందువల్ల వివిధ ఫార్మాట్‌లకు త్వరగా అలవాటు పడాలి. మేము ఇప్పటికీ ఆ T20 నైపుణ్యాలను అదుపులో ఉంచుకుని వన్డే తరహా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మాకు ప్రతి గేమ్ గొప్ప అవకాశం. మలాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. క్లాసెన్ కూడా మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడు. షమ్సీ స్పిన్ విభాగంలోకొచ్చాడు.

ఇరు జట్లు:
భారత్ ( ప్లేయింగ్ XI ): శిఖర్ ధావన్ ( కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications