For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA 5th T20: చివరి మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాదే టాస్, మూడు మార్పులతో ప్రోటీస్, సేమ్ టీంతో ఇండియా

India vs Southafirca Final Match: Southafrica won the toss and elected bowl first

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్ ఈ సాయంత్రం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుదే సిరీస్ సొంతం. ప్రస్తుతం ఇరు జట్లు 2-2 విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇక సిరీస్ విజేతను తేల్చేసే మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశముంది. ఇకపోతే ఇప్పటివరకు భారత జట్టు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాను టీ20 సిరీస్లో ఓడించలేదు. 2015లో ప్రొటీస్ టీమ్.. స్వదేశంలో భారత జట్టును ఓడించి సిరీస్‌ను ఎగరేసుకెళ్లింది.

మళ్లీ 2019లో సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచి స్వదేశంలో తొలిసారి దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవాలనే ఉత్సుకతతో భారత్ ఉంది. ఇక గత రెండు మ్యాచ్‌లలో నిఖార్సయిన విజయాలు సాధించిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఇరువురు కెప్టెన్లు గ్రౌండ్లోకి టాస్ కోసం వచ్చారు.

ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌గా కేశవ్ మహరాజ్ వ్యవహరించనున్నాడు. టాస్ గెలిచిన కేశవ్ మహరాజ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ జట్టు ప్లేయర్లు త్రిస్టన్ స్టబ్స్, రీజా హెండ్రిక్స్, రబాడా జట్టులోకి వచ్చారు. ఇక టీమిండియాను సేమ్ టీంతో కొనసాగిస్తున్నట్లు కెప్టెన్ పంత్ పేర్కొన్నాడు.

తుది జట్లు
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్(కెప్టెన్), లుంగీ న్గిడి, అన్రిచ్ నోర్ట్జే
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

Story first published: Sunday, June 19, 2022, 19:05 [IST]
Other articles published on Jun 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+