For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA 5th T20: వర్షం వల్ల ఆట ఆలస్యం.. నిర్ణయాత్మక మ్యాచ్ కోసం ఉత్కంఠగా ప్రేక్షకులు వెయిటింగ్

India vs Southafirca Final Match: Delay in match start Due to Rain, Southafrica elect bowl

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్‌కు వరణుడు బ్రేకులేశాడు. వర్షం వల్ల ఆట ఆలస్యమవుతుంది. టాస్ తర్వాత వర్షం ప్రారంభం కావడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. దినేష్ కార్తీక్ లాంటి ఆర్సీబీ ప్లేయర్ టీమిండియా తరఫున చెలరేగుతుండడంతో బెంగళూరు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఈ మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చారు. అయితే వర్షం తగ్గి మ్యాచ్ జరిగేలా ఉంది. ఇక ఒకవేళ లేట్ అయితే ఓవర్లు కుదించి మ్యాచ్ జరుపుతారు.

గ్రౌండ్ స్టాఫ్ హుటాహుటిన గ్రౌండ్లోని వాటర్ క్లియర్ చేయడంతో పాటు.. కవర్స్‌తో పిచ్‌ను కప్పేశారు. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుదే సిరీస్ సొంతం. ప్రస్తుతం ఇరు జట్లు 2-2 విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇక సిరీస్ విజేతను తేల్చేసే మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌గా కేశవ్ మహరాజ్ వ్యవహరించనున్నాడు. టాస్ గెలిచిన కేశవ్ మహరాజ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి.

అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగుతున్నాం

అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగుతున్నాం

ఇక టాస్ గెలిచిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్‌లో ఉన్న ఓవర్ హెడ్ పరిస్థితులు, మంచు, ఇతర పరిస్థితులను మేం ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్‌లాగా కనిపిస్తుంది. ట్రిస్టన్ స్టబ్స్, రీజా హెండ్రిక్స్, KG రబడా జట్టులోకి తిరిగి వచ్చారు. ఇక టెంబా బవుమా, మార్కో జాన్సెన్, తబ్రైజ్ షమ్సీలను జట్టు నుంచి తప్పిస్తున్నాం. మేము అదనపు బ్యాటర్ కోసం జట్టులో మార్పులు చేశాం. మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అదనపు బ్యాటర్ వల్ల ఉపయోగం పొందాలని యోచిస్తున్నాం అని పేర్కొన్నాడు.

ఒక్కసారి కూడా టాస్ గెలవని పంత్

ఒక్కసారి కూడా టాస్ గెలవని పంత్

ఇక ఈ సిరీస్లో ఒక్కసారి కూడా టాస్ గెలవని ఇండియా కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. మాకు టాస్‌ విషయం కలిసిరావట్లేదు. ఏదేమైనా ఇది మంచి వికెట్ లాగా ఉంది. మేము 180-190పరుగులు చేయగలిగితే మా సైడ్ మ్యాచ్ ఎడ్జ్ ఉంటుంది. మేము మా ఆట ప్రక్రియపైనే దృష్టి పెట్టాలి. మా తరఫున 100% ఆట కనబరిచాలి. మా తరఫున సేమ్ టీం బరిలోకి దిగుతుంది అని పంత్ పేర్కొన్నాడు.

తుది జట్లు

తుది జట్లు

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్(కెప్టెన్), లుంగీ న్గిడి, అన్రిచ్ నోర్ట్జే

భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

Story first published: Sunday, June 19, 2022, 19:38 [IST]
Other articles published on Jun 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+