Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA 5th T20: అంతా వరుణుడి దయ.. 3.3ఓవర్లకు మ్యాచ్ నిలిపివేత, ప్రతి 4నిమిషాలకు ఒక ఓవర్ కుదింపు

India vs Southafirca 5th T20: Rain Stops Play, Every Four minutes one over will Lapse

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్‌కు వరుణుడు మరోసారి బ్రేకులేశాడు. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. తొలుత టాస్ తర్వాత వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. 7.50కి మ్యాచ్ ప్రారంభం కాగా.. టీమిండియా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు దిగారు. వర్షం వల్ల మ్యాచ్‌ను 19ఓవర్లకు కుదించారు. ఇక మరోసారి వర్షం పడే అవకాశాలున్నాయని భావించిన బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలి ఓవర్లోనే రెండు సిక్సులు కొట్టి మంచి ఊపులో కన్పించాడు.

ఆ ఓవర్లో 16పరుగులొచ్చాయి. ఇక తర్వాతి ఓవర్లో లుంగి ఎంగిడి ఇషాన్ కిషన్ ఊపుకు అడ్డుకట్ట వేశాడు. తెలివిగా స్లో యార్కర్ వేసి ఇషాన్ కిషన్‌ (15పరుగులు 7బంతుల్లో 2సిక్సులు)ను బౌల్డ్ చేశాడు. ఇక రబాడ, లుంగి ఎంగిడి కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ.. పరుగులు రాకుండా అడ్డుకున్నారు. 4ఓవర్ రెండో బంతికి ఎంగిడి.. రుతురాజ్ గైక్వాడ్ (10పరుగులు 12బంతుల్లో 1ఫోర్)ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 27పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన పంత్ 1రన్ తీశాడు. ఇంతలోనే వర్షం ఊపందుకుంది.

దీంతో మ్యాచ్ ఆపాల్సి వచ్చింది. గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో స్టేడియాన్ని కప్పేశారు. ఇప్పటికే ఒక ఓవర్ కుదించి 19వర్లకు మ్యాచ్‌ను డిసైడ్ చేయగా.. ఇక వర్షం ఆగేంత వరకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ఓవర్ చొప్పున కుదించాల్సిన పరిస్థితి వస్తుంది. 8.07నిమిషాలకు మ్యాచ్ ఆగింది. ఎంత తొందరగా వర్షం ఆగితే ఎక్కువ టైం మ్యాచ్ జరిగే వీలుంటుంది. ఇక అంతా ఆ వరుణుడి చేతిలో ఉంది.

తుది జట్లు
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్(కెప్టెన్), లుంగీ న్గిడి, అన్రిచ్ నోర్ట్జే
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

Story first published: Sunday, June 19, 2022, 20:54 [IST]
Other articles published on Jun 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+