Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA 5th T20: వరుణుడు కరుణించలేదే, మ్యాచ్ క్యాన్సిల్, టీమిండియా అప్రదిష్ఠకు పడని ముగింపు..!

1 rain

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. తద్వారా 2010తర్వాత ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఇండియాలో ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్ (టీ20లు, వన్డేలు) కూడా ఓడిపోని రికార్డును అలాగే నిలబెట్టుకుంది. ఇక దక్షిణాఫ్రికాకై సిరీస్ గెలిచి అప్రదిష్ఠకు తెరదించాలనుకున్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఇక వైజాగ్, రాజ్ కోట్‌లలో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చిన టీమిండియా బెంగళూరులో కూడా గెలిచి సిరీస్‌ను గెలవాలనే తాపత్రయం వర్షం వల్ల నీరుగారింది. చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తిన వేలాది ప్రేక్షకులు వాన దేవుణ్ని తిట్టుకుంటూ స్టేడియం నుంచి ఇంటిబాటపట్టారు. ఇక 9.40వరకు ప్రేక్షకులు వానలో తడచుకుంటూనే ఎదురుచూశారు. కానీ వరుణుడు కరుణించలేదు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ తర్వాత వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. 7.50కి మ్యాచ్ ప్రారంభం కాగా.. టీమిండియా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు దిగారు. వర్షం వల్ల మ్యాచ్‌ను 19ఓవర్లకు కుదించారు. ఇషాన్ కిషన్ తొలి ఓవర్లోనే రెండు సిక్సులు కొట్టి జోరందుకున్నాడు. అయితే 2వ ఓవర్లో లుంగి ఎంగిడి ఇషాన్ కిషన్ ఊపుకు అడ్డుకట్ట వేశాడు. తెలివిగా స్లో యార్కర్ వేసి (15పరుగులు 7బంతుల్లో 2సిక్సులు)ను బౌల్డ్ చేశాడు. మళ్లీ 4ఓవర్ రెండో బంతికి ఎంగిడి.. రుతురాజ్ గైక్వాడ్ (10పరుగులు 12బంతుల్లో 1ఫోర్)ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 27పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన పంత్ 1రన్ తీశాడు. 3.3ఓవర్లలో స్కోరు 2వికెట్లు కోల్పోయి 28పరుగులకు చేరుకుంది. ఇంతలోనే వర్షం ఊపందుకుంది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఇక వర్షం తగ్గేవరకు వేచి చూశారు. కానీ ఎంతకు వర్షం తగ్గలేదు. ముసురు పడ్డట్లు కొనసాగుతూనే ఉండడంతో ఫైనల్‌గా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు 9.40కు ప్రకటించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు.

తుది జట్లు
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్(కెప్టెన్), లుంగీ న్గిడి, అన్రిచ్ నోర్ట్జే
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

Story first published: Sunday, June 19, 2022, 22:46 [IST]
Other articles published on Jun 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+