
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న కేప్ టౌన్ పిచ్ బౌన్సీ పిచ్ ఎంతమాత్రం కాదని క్యూరేటర్ స్పష్టం చేశాడు. నిజానికి తొలి టెస్టులో పేస్ బౌలింగ్‌తో భారత్‌ను బెంబేలెత్తించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికాకు నిజంగా ఇది ఎదురుదెబ్బేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
కేప్ టౌన్‌లో ప్రస్తుతం తీవ్ర నీటికొరత ఉంది. దీంతో అక్కడ నీటిని చాలా తక్కువగా వాడుతున్నారు. ప్రజలు సైతం రోజుకు 87 లీటర్ల కన్నా ఎక్కవ నీటిని వినియోగించడానికి వీల్లేదని ఆదేశాలు కూడా ఉన్నాయి. పిచ్‌ను పేస్, బౌన్స్‌కు అనుకూలంగా తీర్చి దిద్దడం చాలా కష్టంగా మారిందని క్యూరేటర్ తెలిపాడు.
ప్రస్తుతం మైదానాన్ని తడిపేందుకు బోరు నీటినే వినియోగిస్తున్నారు. దీంతో చివరకు వికెట్ పొడిగా మారి స్పిన్‌కు అనుకూలంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నాడు. 'బోరు నీటితో ఎప్పటిలాగే ప్రతిరోజు పిచ్‌ను తడుపుతున్నాం. ఔట్ ఫీల్డ్‌ను మాత్రం వారానికి రెండుసార్లే తడుపుతున్నాం' అని చెప్పాడు.
'అందుకే మైదానం అంత పచ్చికతో అందంగా కనిపించకపోవచ్చు. పొడిగా ఉండచ్చు. పిచ్‌పై పచ్చికను పెంచడం కూడా కష్టంగా మారింది. పేస్‌కు అనుకూలించేలా పిచ్‌ను రూపొందించాలని అనుకుంటున్నాం. అయితే రోజూ ఉదయం వానపడి ఆ తర్వాత ఎండకాస్తేనే అది సాధ్యం. అలా ఎన్నిరోజులు జరుగుతుందో చెప్పలేం' అని పిచ్ క్యూరేటర్ ఇవాన్ ఫ్లింట్ అన్నాడు.
వాండరర్స్, సెంచూరియన్ తరహాలో కేప్‌టౌన్ పిచ్ ముందు బౌలర్లకు అనుకూలించినప్పటికీ ఆ తర్వాత ఇబ్బందులు ఎదురుకావచ్చు అని ఫ్లింట్ పేర్కొన్నాడు. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉంటేనే బంతి స్వింగ్ అవుతుందని, అదనపు బౌన్స్ లభిస్తుందని చెప్పాడు. అదే నెర్రలు పడి, పొడిగా ఉంటే మాత్రం స్పిన్‌కు అనుకూలిస్తుందని అన్నాడు.
జనవరి 5 నుంచి జరిగే తొలి టెస్టులో ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్‌ను రూపొందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ విజృభించి విజయంతో ఈ సిరిస్‌ను ఆరంభించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.