For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: 'వరల్డ్‌కప్ లేదా ఐపీఎల్' స్పష్టతనిచ్చిన డీకాక్

India vs South Africa: World Cup or IPL? - Quinton de Kock clarifies

హైదరాబాద్: తన బ్యాటింగ్‌పై కెప్టెన్సీ బాధ్యత ఏ మేరకు ప్రభావం చూపుతుందో తాను చెప్పలేనని సఫారీ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డీకాక్ తెలిపాడు. భారత పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరిస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్వింటన్ డీకాక్ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

మొహాలీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం రెండో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో క్వింటన్ డీకాక్ మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్సీ బాధ్యత బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు క్వింటన్ డీకాక్ స్పందించాడు.

"నిజం చెప్పాలంటే కెప్టెన్సీ బాధ్యత నా ఆటపై పెద్దగా ప్రభావం చూపుతుందనుకోను. నా కెరీర్‌లో ఇదొక మైలురాయి. హోదా మారినంత మాత్రాన ఆటలో మార్పు వస్తుందని నేననుకోవడం లేదు. నేను ఎప్పటిటాగే బ్యాటింగ్‌ చేయగలను. డుప్లెసిస్, డివిలియర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను" అని డీకాక్ పేర్కొన్నాడు.

"వారు తమ కెరీర్‌లో ఏదైతో చేశారో మేము కూడా అలానే చేస్తున్నాం. జట్టులోని లీడర్‌షిప్ గ్రూపు యువ ఆటగాళ్లకు విలువైన సూచనలు చేస్తున్నారు. యువ ఆటగాళ్లుగా మేము వారి నుంచి ఇంకా నేర్చుకుంటున్నాం. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనందుకు నిరాశగా ఉంది. అయినా మిగితా రెండు మ్యాచ్‌లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం. మా కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు" అని డీకాక్ తెలిపాడు.

ఐపీఎల్‌లో డీకాక్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. దీనిపై డీకాక్ మాట్లాడుతూ "ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడం చాలా గర్వంగా ఉంది. ఇప్పటివరకు నేను గెలిచిన ఉత్తమ ట్రోఫీ అదే. అదే వరల్డ్‌కప్ గెలిస్తే అదే అతిపెద్ద ఘనత అవుతుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనేది ప్రతి ఒక్క క్రికెటర్‌కు అతి పెద్ద ఘనత" అని చెప్పుకొచ్చాడు.

"ఒక క్రికెటర్‌గా ఐపీఎల్ ఫైనల్స్, వరల్డ్‌కప్ పైనల్స్ ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ముంబై ఇండియన్స్‌లో భాగమైనందుకు నేను అదృష్టవంతున్ని" అని డీకాక్ తెలిపాడు. కాగా, ఈ సిరిస్‌లో రబాడ, కోహ్లీల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించాడు.

"వారిద్దరూ చాలా తెలివైన ఆటగాళ్లు. ఆయా విభాగాల్లో వారిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ ఆరోగ్యకరంగానే ఉంటుంది. ఇండియా చాలా బలమైన జట్టు. ప్రపంచ నెంబర్‌వన్‌ ఆటగాళ్లు(కోహ్లీ, బుమ్రా) వారి దగ్గరున్నారు. వారిని ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నాం" అని డీకాక్ అన్నాడు.

Story first published: Tuesday, September 17, 2019, 19:19 [IST]
Other articles published on Sep 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+