
హైదరాబాద్: సఫారీ పర్యటనలో ఉన్న భారత పురుషుల, మహిళల జట్లు విజయాల పరంపరతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కోహ్లీ సేన సఫారీ జట్టుతో రాత్రి సమయంలో తలపడనుంది. మహిళల జట్టు సాయంత్రం నాలుగున్నర గంటలకు పొట్టి క్రికెట్ టీ20 సమరానికి దిగింది.
భారీ ఆశలతో బరిలోకి దిగిన ఇరు జట్ట ఆశలను వర్షం నీరుగార్చింది. దీంతో నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. ఇలా మహిళల వర్షంతో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి. ఒకవేళ వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ పచ్చిగా ఉండడం, మరి కొద్ది గంటల్లో పురుషుల మ్యాచ్ ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఇదే భారత మహిళల టీ20 చరిత్రలో రద్దైన తొలి మ్యాచ్‌కావడం విశేషం. దీంతో హర్మన్ ప్రీత్ సేన నిర్ణయాత్మక ఐదో టీ20 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు చివరి మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం అవుతోంది. లేకుంటే డ్రాగా ముగుస్తోంది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు మ్యాచ్ నిలిచే సమయానికి 15.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ నికెర్క్ (55),
లిజెల్లే లీ(59) రాణించారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో పురుషుల మ్యాచ్ కోసం సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసేందుకు కష్టపడుతున్నారు.