India vs South Africa: ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు.. ఎక్కడంటే?
వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ ఆడింది. కానీ టీమిండియా అభిమానులకు అంతగా ఈ సిరీస్‌లపై ఆసక్తి కలగలేదు. దీనికి ప్రధాన కారణం తుది పోరులో తడబడి మెగాట్రోఫీని చేజార్చుకోవడం. అయితే ఇప్పుడు అభిమానులంతా భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
31 ఏళ్లుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న భారత్‌కు టెస్టు సిరీస్ విజయం అందని ద్రాక్షగా మిగిలింది. 1992 నుంచి ఇప్పటివరకు ఎనిమిది సార్లు సఫారీ గడ్డకు వచ్చింది. కానీ టెస్టు సిరీస్‌ను అందుకోలేకపోయింది. 2010లో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేయడమే టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ సారి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతుంది.

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా ఇవాళ తొలి టెస్టు జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను మొబైల్స్‌లో ఫ్రీగా చూడొచ్చు. డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. కాగా, టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో మ్యాచ్ లైవ్ వస్తుంది.
అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు. చివరి టెస్టు కేప్‌టౌన్‌లో జనవరి 03న మొదలవుతుంది.
భారత్ జట్టు వివరాలు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్,కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications