Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో ‘బాక్సింగ్ డే’ టెస్టు అంటే ఏంటి? రౌడీల్లా ప్లేయర్లు కొట్టుకుంటారా?

క్రికెట్ ప్రపంచం గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న 'బాక్సింగ్ డే ' టెస్టు మజా వచ్చేసింది. ఇవాళ రెండు టెస్టులు జరగనున్నాయి. పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రపంచకప్ ఓటమి అనంతరం స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.

అయితే 'బాక్సింగ్ డే టెస్టు' అంటే ఏంటి? అనే ప్రశ్న ఎంతోమంది మదిలో కలుగుతుంది. క్రికెట్‌లో బాక్సింగ్ డే ఏంటి? క్రికెట్, బాక్సింగ్ రెండూ విభిన్న క్రీడలు కదా అనే సందేహాలు వస్తాయి. అయితే 'బాక్సింగ్ డే' అని పిలవడానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ జరిగిన మరుసటి రోజును 'బాక్సింగ్ డే'గా జరుపుకుంటారు.

India vs South Africa: What is the boxing day test in cricket? Will the players fight like street bullies?

బాక్సింగ్ డే వేడుకల వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. క్రిస్మస్ రోజు సెలవు తీసుకోకుండా పని చేసే ఉద్యోగులకు మరుసటి రోజు బాక్స్ రూపంలో బహుమతి ఇచ్చి సెలవు ఇస్తారు. అలా బాక్సింగ్ డే ఆనవాయితీ మొదలైందని అంటుంటారు. అలాగే బ్రిటన్ నావికా సంప్రదాయం నుంచి వచ్చిందని కూడా అంటారు. సుదీర్ఘ ప్రయాణాల కోసం డబ్బును బాక్స్‌లలో ఉంచుతారు. సముద్ర ప్రయాణం విజయవంతమైన తర్వాత ఆ బాక్స్‌లను పేదలకు పంచుతారు. అందుకే బాక్సింగ్ డే పిలుస్తారని మరో కథ.

ఇక క్రికెట్‌లో బాక్సింగ్ డే రోజున ఆడటంతో బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. ఇది 19వ శతాబ్దం నుండి మొదలైంది. 1865లో మెల్‌బోర్న్ వేదికగా విక్టోరియా-న్యూసౌత్‌వేల్స్ మ్యాచ్ తొలి బాక్సింగ్ డే టెస్టుగా భావిస్తారు. 1950లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి అధికారిక బాక్సింగ్ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందింది. 1980 నుంచి ప్రతి ఏడాది బాక్సింగ్ డే టెస్టులు జరుగుతున్నాయి.

గత బాక్సింగ్ డే టెస్టుల్లో భారత్‌కు గొప్ప రికార్డు ఉంది. 2018 నుంచి ఆడిన మూడు బాక్సింగ్‌ డే టెస్టులలో టీమిండియాదే విజయం. 2018, 2020లలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్, 2021లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది.

Story first published: Tuesday, December 26, 2023, 9:18 [IST]
Other articles published on Dec 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+