ఎమ్మెస్కే వివరణ.. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేసామంటే?

ముంబై: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు గురువారం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. అందరూ ఊహించినట్లే ఈ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు. విండిస్ పర్యటనకు ఎంపికై.. తుది జట్టులో చోటు దక్కించుకోలేని రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది:
రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఎమ్మెస్కే మాట్లాడుతూ... ' టెస్ట్ ఫార్మట్‌లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. రోహిత్ చాలా ఆసక్తిగా ఉన్నాడు. అతనితో పాటు సెలక్షన్ కమిటీలోని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అతనికి కొన్ని అవకాశాలు ఇచ్చి ఎలా రాణిస్తాడో చూడాలి. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణించని రోహిత్.. ఓపెనర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడని భావిస్తున్నాం' అని తెలిపారు.

రాహుల్ దారులు మూసుకపోలేదు:
'వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో రోహిత్‌కు ఓపెనింగ్ అవకాశం రాలేదు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని ఓపెనర్‌గా ఎంపిక చేశాం. పరుగులు చేస్తాడని ఆశిస్తున్నాం. కేఎల్ రాహుల్ దారులు మాత్రం మూసుకపోలేదు. రాహుల్ అద్భుత ప్రతిభగల ఆటగాడు. ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. త్వరలోనే తిరిగి జట్టులోకి వస్తాడనే నమ్మకం ఉంది' అని ఎమ్మెస్కే ధీమా వ్యక్తం చేశారు.

ఓపెనింగ్ అవకాశం ఇవ్వాలని సూచనలు:
రోహిత్‌కు టెస్టుల్లో ఓపెనింగ్ అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు సూచించారు. రోహిత్ ఓపెనర్‌గా దింపితే అది టీమిండియాకు ఎంతో లాభిస్తుందని వారు అన్నారు. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో రాహుల్ దారుణంగా విఫలమవ్వడంతో సెలక్టర్లు రోహిత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌తో రోహిత్ టెస్టు సత్తా ఏంటో తెలుస్తుంది.

జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్‌కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), చటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications