న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ భయపడకు... ధోనిని టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దించు

By Nageshwara Rao
India vs South Africa: Virender Sehwag reveals why Virat Kohli doesn't promote MS Dhoni up the order

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన కల్పిస్తే బాగుంటుందని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. సఫారీ పర్యటనలో వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శన చేసిన ధోని బ్యాటింగ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

మిడిలార్డర్‌లో మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాల తర్వాత బ్యాటింగ్‌కు దిగుతోన్న ధోని చివరి ఓవర్లో కుదురుకునేందుకే సమయం సరిపోవడం లేదు. దీంతో పెద్దగా పరుగులు రాబట్టలేక పోతున్నాడు. దీంతో ధోనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వకార్ యునిస్ రికార్డు బద్దలు: చరిత్ర సృష్టించిన ఆప్ఘన్ టీనేజర్వకార్ యునిస్ రికార్డు బద్దలు: చరిత్ర సృష్టించిన ఆప్ఘన్ టీనేజర్

ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ధోని ఎంత విలువైన ఆటగాడు అందరికీ తెలిసిందే. ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా సెహ్వాగ్ మీడియాతో మాట్లాడాడు.

ధోనికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సెహ్వాగ్ వ్యక్తం చేశాడు. ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే.. అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉంటే ఫర్వాలేదు. ఒకవేళ త్వరగా అవుటైతే మాత్రం భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోతామని కోహ్లీ భయపడుతూ ఉండొచ్చని అన్నాడు.

మీ వంటకాలొద్దు: కోహ్లీసేన కోసం గీత్ రెస్టారెంట్ నుంచి ప్రత్యేక భోజనంమీ వంటకాలొద్దు: కోహ్లీసేన కోసం గీత్ రెస్టారెంట్ నుంచి ప్రత్యేక భోజనం

అంతేకాదు, ధోనికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ కల్పించి.... మనీష్ పాండే, హార్దిక్, జాదవ్‌ల్లో ఒకరికి ఫినిషర్‌గా బాధ్యతలు అప్పగించాలని సెహ్వాగ్ సూచించాడు. టీమిండియా టీ20ల్లో తొలి విజయాన్ని సఫారీ గడ్డపైనే 2006లో సాధించడం విశేషం. 2007లో జరిగిన తోలి టీ20 వరల్డ్ కప్‌ను ధోని నేతృత్వంలోని టీమిండియా సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, February 18, 2018, 16:00 [IST]
Other articles published on Feb 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X