Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: కన్నీటితో కోహ్లి వీడియో కాల్..కొడుకుతో సంబరాలు (Video)

టీ20 ఫార్మాట్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఫైనల్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సమయంలో కోహ్లి మాట్లాడుతూ.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. భవిష్యత్ తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టీ20లకు గుడ్‌బై చెప్పాడు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును కోహ్లి ఆదుకున్నాడు. ఇన్నింగ్స్‌కు విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇరుసులా నిలబడ్డాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటడంతో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది.

India vs South Africa Virat Kohli s Emotional Call to Son Ayan After T20 World Cup 2024 Victory

కేశవ్ మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (39; 31 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు. హార్దిక్ పాండ్య (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.

అయితే విజయానంతరం విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్న అనంతరం తన ఫ్యామిలీకి వీడియో కాల్ చేశాడు. కాల్‌లో తన భార్య అనుష్క శర్మ, కుమారై వామిక, కుమారుడు అయాన్‌తో మాట్లాడాడు. కాల్ మాట్లాడుతున్న సమయంలో కోహ్లి కళ్లలో తడి కనిపించింది. ప్రపంచకప్ గెలిచిన ఆనందం, టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై పలికిన బాధ కలయికతో కోహ్లి ఎమోషలన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, కోహ్లి ఈ ప్రపంచకప్‌లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో 75 పరుగులు చేశాడు. కీలక ఫైనల్‌లో మాత్రం 76 పరుగులు బాదాడు.

Story first published: Sunday, June 30, 2024, 11:08 [IST]
Other articles published on Jun 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+