న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: పూణె టెస్టులో కోహ్లీ సెంచరీ: గవాస్కర్ రికార్డు బద్దలు, పాంటింగ్ రికార్డు సమం

IND vs SA 2nd Test : Kohli Surpasses Sunil Gavaskar,Equals Ponting
India vs South Africa: Virat Kohli surpasses Sunil Gavaskar, equals Ricky Ponting with century in Pune

హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 173 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇదే తొలి సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి కోహ్లీకి 9 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది.

అంతకముందు 8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత తరుపున సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దిలిప్ వెంగ్ సర్కార్‌ను వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ 7వ స్థానానికి ఎగబాకాడు.

1
46114

India vs South Africa: కోహ్లీ సెంచరీ, లంచ్ విరామానికి టీమిండియా 356/3India vs South Africa: కోహ్లీ సెంచరీ, లంచ్ విరామానికి టీమిండియా 356/3

టెస్టుల్లో కోహ్లీ 26వ సెంచరీ

టెస్టుల్లో కోహ్లీ 26వ సెంచరీ

టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 26వ సెంచరీ. ఇక, కెప్టెన్‌గా 19వ సెంచరీ. ఈ క్రమంలో టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో కలిసి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ కెప్టెన్‌గా టెస్టుల్లో 19 సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(25 సెంచరీలు)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

గవాస్కర్ రికార్డు బద్దలు

గవాస్కర్ రికార్డు బద్దలు

ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్(15), స్మిత్(15), స్టీవ్ వా(15) సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు తన 26వ టెస్టు సెంచరీతో విరాట్ కోహ్లీ మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డుని కూడా బద్దలు కొట్టాడు. టెస్టుల్లో 26 సెంచరీలు సాధించేదుకు కోహ్లీకి 138 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

అగ్రస్థానంలో బ్రాడ్‌మన్

అగ్రస్థానంలో బ్రాడ్‌మన్

అదే సునీల్ గవాస్కర్‌ ఈ మైలురాయిని 144 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. ఇక, ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్(69 ఇన్నింగ్స్‌లు)తో అగ్రస్థానంలో ఉండగా... స్టీవ్ స్మిత్(121), సచిన్ టెండూల్కర్(136) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, పూణె టెస్టులో కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్‌ల్లో 16 బౌండరీలు ఉన్నాయి.

లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 356 పరుగులు

లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 356 పరుగులు

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా రెండో రోజు లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 356 పరుగులు చేసింది. ముఖ్యంగా ఈ సెషన్‌లో సఫారీ బౌలర్లు వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(104), రహానే(58) పరుగులతో ఉన్నారు.

Story first published: Friday, October 11, 2019, 12:42 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X