పని చేసింది: టెంబా బావుమా కోసం విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్! (వీడియో)

హైదరాబాద్: ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అయితే, శుక్రవారం విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా ఎందుకు కొనియాడబడుతున్నాడో అర్ధమైంది. ప్రస్తుతం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది.
కోహ్లీ మ్యాచ్ పరిస్థితిని అంచనా వేయడంతో దిట్ట. మూడోరోజైన శుక్రవారం ప్రమాదకరంగా మారుతున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ టెంబా బావుమాను పెవిలియన్‌కు చేర్చడంలో కోహ్లీ వేసిన ప్లాన్ విజయవంతం అయింది. బావుమా వికెట్ తీసేందుకు బౌలింగ్ విభాగానికి కోహ్లీ సాయం చేశాడు.
బావుమాను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ
టెంబా బావుమాను ఔట్ చేసేందుకు విరాట్ కోహ్లీ పేసర్ ఇషాంత్ శర్మను రంగంలోకి దించాడు. ఇషాంత్ శర్మ వేసిన తొలి నాలుగు డెలివరీలు ఆఫ్ సైడ్ స్టంప్‌కు దూరంగా విసిరాడు. అయితే, ఆ తర్వాత ఐదో బంతిని ఇషాంత్ శర్మ అనూహ్యాంగా ఆఫ్‌స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని సంధించాడు.
బంతిని అంచనా వేయడంలో బావుమా విఫలం
అయితే, తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అంచనా వేయడంలో బావుమా విఫలమయ్యాడు. ఇంకేముంది అతడు తన బ్యాట్‌ను అడ్డుపెట్టేలోపు బంతిని వెళ్లి అతడి ప్యాడ్లను తాకింది. దీంతో భారత ఫీల్డర్లు అంఫైర్‌ను సంప్రదించగా... అతడు ఏమాత్రం ఆలోచించకుండా అతడిని ఔట్‌గా ప్రకటించాడు.
రివ్యూ కోరకుండానే నిరాశగా
మరోవైపు బావుమా కూడా చేసేదేమీ లేక రివ్యూ కోరకుండానే నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. బావుమా ఔటైన తర్వాత రీప్లేలో డెలివరీకి ముందు విరాట్ కోహ్లీ.. ఇషాంత్ శర్మకు వెలుపల ఆఫ్ స్టంప్‌కు ఆవలగా బంతిని సంధించమని సలహా ఇస్తున్నట్లు చూపించడం విశేషం.
శ్రమిస్తోన్న భారత బౌలర్లు
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడో రోజు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తెగ శ్రమపడుతున్నారు. మరోవైపు డీన్ ఎల్గర్ సెంచరీ సాధించి భారీ స్కోరు దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం 88 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
డీన్ ఎల్గర్ సెంచరీ
క్రీజులో ఓపెనర్ డీన్ ఎల్గర్ (135), క్వింటన్ డీకాక్(70) హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా... ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది. భారత ఓపెనర్లు మయాంక అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగగా, రోహిత్ శర్మ సెంచరీతో రాణించడంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications