Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మిత్‌ను అధిగమించాడు: సెంచూరియన్‌లో కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే

India vs South Africa: Virat Kohli's Centurion hundred beats Steve Smith in this statistic

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్. వీరిద్దరూ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నారు. అయితే తాజాగా స్టీవ్ స్మిత్ రికార్డుని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

స్మిత్‌ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా స్మిత్‌ రికార్డును అధిగమించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే గత ఏడేళ్ల కాలంలో విరాట్ కోహ్లీ (టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూస్తే) విదేశాల్లో నమోదు చేసిన సెంచరీల సంఖ్య 11 కాగా, అదే సమయంలో స్మిత్‌ విదేశాల్లో చేసిన టెస్టు సెంచరీల సంఖ్య 10గా ఉంది.

 కెప్టెన్‌గా 14వ సెంచరీ

కెప్టెన్‌గా 14వ సెంచరీ

తద్వారా స్టీవ్ స్మిత్‌తో విదేశాల్లో సెంచరీల రికార్డును కోహ్లీ మరింతగా మెరుగుపరచుకున్నాడు. అంతేకాదు రెండో టెస్టులో కోహ్లీ నమోదు చేసిన సెంచరీ టెస్టుల్లో 21వ సెంచరీ కాగా, కెప్టెన్‌గా 14వ సెంచరీ. దీంతో టెస్టుల్లో 14 సెంచరీలు సాధించిన దిగ్గజ కెప్టెన్లు.. డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా, జయవర్ధనే, మైకేల్ క్లార్క్‌ల సరసన నిలిచాడు.

సచిన్ తర్వాత సెంచరీ చేసిన కెప్టెన్‌గా కోహ్లీ

ఇందులో విదేశాల్లో కోహ్లీ 7 సెంచరీలు సాధించగా, స్వదేశంలో కూడా 7 సెంచరీలు నమోదు చేశాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికా గడ్డపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత సెంచరీ సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కేప్‌టౌన్‌లో 1996లో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 169 పరుగులు సాధించాడు.

 నాలుగో స్ధానంలో కోహ్లీ

నాలుగో స్ధానంలో కోహ్లీ

ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలు తరువాత సఫారీ గడ్డపై టెస్టు సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 21 సెంచరీలు సాధించిన వారిలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 110 ఇన్నింగ్స్‌లో 21 సెంచరీలు పూర్తి చేయగా, కోహ్లీ 109 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు.

 కెప్టెన్‌గా విదేశాల్లో అత్యధిక సెంచరీలు

కెప్టెన్‌గా విదేశాల్లో అత్యధిక సెంచరీలు

బ్రాడ్‌మన్‌(56 ఇన్నింగ్స్‌), సునీల్‌ గవాస్కర్‌(98), స్టీవ్‌ స్మిత్‌(105) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో అంతర్జాతీయ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ (53 సెంచరీలు) రికార్డు సృష్టించాడు. భారత కెప్టెన్‌గా విదేశాల్లో అత్యధిక టెస్ట్‌ సెంచరీలు సాధించిన వారిలో కోహ్లీ ముందున్నాడు.

 ఆమ్లా రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

ఆమ్లా రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

అజారుద్దీన్‌(5), సచిన్‌(4), ద్రవిడ్‌(4), గంగూలీ(3) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రెండో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా ఆమ్లా పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. తన కెరీర్‌లో ఆమ్లా 53 సెంచరీలు చేయడానికి 380 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కోహ్లీకి 354 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

Story first published: Tuesday, January 16, 2018, 10:55 [IST]
Other articles published on Jan 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+