Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీ టెస్ట్: నెట్స్‌లో భారత్‌ ప్రాక్టీస్‌.. కోహ్లీ, రోహిత్ దూరం!!

IND vs SA,3rd Test : Virat Kohli, Rohit Sharma Absent As India Sweat It Out At Optional Practice
India vs South Africa: Virat Kohli, Rohit Sharma skipped the optional practice session for third Test

రాంచీ: ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 19 (శనివారం) నుంచి చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే చివరి టెస్టు కోసం భారత ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్‌లు అజింక్య రహానే, చతేశ్వర పుజారా, మయాంక్‌ అగర్వాల్.. బౌలర్‌ ఇషాంత్‌ శర్మ పాల్గొన్నారు. అయితే ఈ ఆప్షనల్ ప్రాక్టీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు దూరంగా ఉన్నారు. ఇద్దరు హోటల్ గదులకు పరిమితమయ్యారు.

కుల్దీప్‌కు మళ్లీ నిరాశ తప్పదు?:

కుల్దీప్‌కు మళ్లీ నిరాశ తప్పదు?:

మూడో టెస్టు కోసం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెమటోడ్చుతున్నాడు. వైజాగ్, పుణె టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్.. రాంచీలో బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. కుల్దీప్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్నా.. తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే ఉంది. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. అశ్విన్ వికెట్ల వేటలో ఉండగా.. జడేజా వికెట్లతో పాటు వేగంగా పరుగులు కూడా చేస్తున్నాడు. ఇద్దరిలో ఒకరిని కోహ్లీ పక్కన బెట్టే సాహసం చేయలేడు. కాబట్టి కుల్దీప్‌కు మళ్లీ నిరాశ తప్పదు.

ప్రాక్టీస్‌ సెషన్‌లో డుప్లెసిస్:

ప్రాక్టీస్‌ సెషన్‌లో డుప్లెసిస్:

శుక్రవారం జరిగే ప్రాక్టీస్‌లో జట్టు భారత ఆటగాళ్లంతా పాల్గొంటారు. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పిచ్‌ను పరిశీలించారు. పొడిగా ఉన్న వికెట్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ వికెట్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. ఇక పొడిగా ఉన్న పిచ్ నుంచి రివర్స్ స్వింగ్ కూడా లభించొచ్చు. అంతకు ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. డుప్లెసిస్, బవుమా, డిబ్రుయన్, డికాక్, ముత్తుస్వామి ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.

స్పిన్, రివర్స్‌స్వింగ్ కీలక పాత్ర:

స్పిన్, రివర్స్‌స్వింగ్ కీలక పాత్ర:

ఈ మ్యాచ్‌లో స్పిన్, రివర్స్‌స్వింగ్ కీలక పాత్ర పోషిస్తాయని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ గురువారం పేర్కొన్నాడు. కెప్టెన్‌తో పాటు రబాడ కూడా రివర్స్‌స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నాడు. రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ చేతికి గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. పుణే టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్‌ అయిన మార్క్‌రమ్‌.. మ్యాచ్‌ తర్వాత ఆ అసహనాన్ని ఒక వస్తువుపై చూపించాడు. దాంతో అతని చేతికి తీవ్ర గాయమైంది.

Story first published: Friday, October 18, 2019, 10:35 [IST]
Other articles published on Oct 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+