కోహ్లీ వివరణ: దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు చాహల్, కుల్‌దీప్‌ను ఎందుకు తీసుకోలేదంటే?

ధర్మశాల: ప్రపంచకప్ అనంతరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీ20 ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే ముగిసిన విండీస్ టూర్‌కు యువకులకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కుర్రాళ్లకు చోటిచ్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్‌లకు టీ20 జట్టులో చోటివ్వలేదు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. ఈ ఇద్దరికి చోటు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.

ఒకే జట్టు కూర్పునకు పరిమితం కాం:
శనివారం ధర్మశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో విరాట్ మాట్లాడుతూ... 'లోయర్ ఆర్డర్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌ను బలపరిచేందుకే చాహల్, కుల్‌దీప్‌లకు అవకాశం కల్పించలేదు. జాతీయస్థాయిలో, ఐపీఎల్‌ల్లో మంచి పదర్శన కనబర్చిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అత్యుత్తమ జట్టును తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకే జట్టు కూర్పునకు పరిమితం కాము' అని విరాట్ తెలిపాడు.

కొత్త ఆటగాళ్లని పరీక్షించాలనుకుంటున్నాం:
'ప్రస్తుతం అన్ని జట్లలలో తొమ్మిది, పది స్థానాల వరకు బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. టీమిండియా కూడా అలా ఆడడానికి ప్రయత్నింస్తున్నాం. ఏ క్రమంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకూ టీమిండియాకు చాలానే టీ20లు ఆడే అవకాశం ఉంది. దీంతో కొత్త ఆటగాళ్లని పరీక్షించేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో యువ ఆటగాళ్ల ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించాలనుకుంటున్నాం' అని విరాట్ పేర్కొన్నాడు.

జట్టు కూర్పును బలోపేతం కావాలి:
'ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే విధంగా జట్టు కూర్పును బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నాం. అందుకే రెగ్యులర్ ఆటగాళ్లకు కాకుండా ఇతర ఆటగాళ్లకి అవకాశమిచ్చి వారిని పరిశీలిస్తాం. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్‌లో కొత్త ఆటగాళ్లు దూసుకొస్తున్న. అందరూ తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొవాలని ఆశిస్తున్నా' అని విరాట్ చెప్పుకొచ్చాడు.

వైవిధ్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం:
తాజాగా చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ మాట్లాడూతూ... 'స్పిన్ బౌలింగ్ విభాగంలో వైవిధ్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరుగున్న టీ20 ప్రపంచకప్ వరకు యువ క్రికెటర్లను పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్, చహల్‌లు పొట్టి ఫార్మాట్‌లో మంచి బౌలర్లు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా జట్టులో వారి ముద్ర కనబడుతోంది. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు' అని అన్నాడు.

మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే:
'యువ క్రికెటర్లను కూడా జట్టులోకి తేవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఫాస్ట్ బౌలర్‌లు నవదీప్ షైనీ, దీపక్ చాహర్ బాగా రాణించారు. శ్రేయస్ అయ్యర్ కూడా సత్తాను నిరూపించుకున్నాడు. కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌లు పొట్టి ఫార్మాట్‌లో మంచి ప్రదర్శన చేశారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే కుల్దీప్, చహల్‌లను పక్కకు పెట్టాం' అని ఎంఎస్‌కే తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications