
హైదరాబాద్: భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సఫారీ జట్టు తొలి టీ20 జరిగే ధర్మశాలకు చేరుకుంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.
తొలి టీ20 ఆదివారం ధర్మశాల వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20 కోసం శుక్రవారం ధర్మశాలకు చేరుకున్న భారత జట్టుకు చక్కటి ఆతిథ్యం లభించింది. హోటల్ సిబ్బంది ఆటగాళ్లకి పూలమాలలతోపాటు, స్థానిక టోపీలు బహుకరించి స్వాగతం పలికారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. టీ20 సిరిస్‌లో సపారీ జట్టుకు కెప్టెన్‌గా క్వింటన్ డీకాక్ వ్యవహారించనున్నాడు. ఇప్పటివరకూ టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాపై ఒక్క టీ20 సిరిస్ కూడా నెగ్గలేదు.
చివరగా 2015లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు టీ20 సిరిస్‌ను 2-0తో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ పర్యటనలో కూడా టీ20 సిరిస్‌ను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు టీమిండియా సైతం సఫారీలపై విజయం సాధించాలని ఊవిళ్లూరుతోంది.
టీమిండియా
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.