
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఎంతగానో రాణిస్తారనుకుని ఆశలు పెట్టుకున్న భారత జట్టు ఆటగాళ్లు అందరూ రాణించలేకపోతున్నారు. బౌలర్లు మినహాయించి ధోనీ, కోహ్లీ, ధావన్ వీళ్లే మ్యాచ్ ను ఓ దారికి తెస్తున్నారు. వన్డేల హీరో రోహిత్ సైతం 30కు మించిన స్కోరు దక్షిణాపర్యటన మొత్తంలో చేయలేకపోయాడు.
ఈ పర్యటనలో పెద్దగా పరుగులు చేయలేకపోతున్న వాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతడు కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రెండు టెస్టుల్లోనూ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో రెండు, మూడో టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ధావన్‌కు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చినప్పటికీ సత్తా చాటలేకపోయాడు. ఐతే దక్షిణాఫ్రికా పర్యటనలో తన ఫామ్ గురించి మాత్రం ఎలాంటి ఆందోళన చెందట్లేదని, నేర్చుకునే అవకాశం వచ్చిందని అంటున్నాడు.
అయితే పర్యటన గురించి టెస్టు సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నాడు. 'నేనెప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తుంటాను. మనం ఆటలు ఆడుతున్నప్పడు మంచి రోజుల కన్నా చెడు రోజులే ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ దినదినాభివృద్ధి సాధించాలని' రాహుల్ అన్నాడు.
ప్రోటీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో పాల్గొనేందుకు త్వరలో రాహుల్ దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడు. కేవలం టెస్టు సిరీస్ జరిగిన నెల రోజులు మాత్రమే అక్కడ ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న కర్ణాటక బ్యాట్స్‌మన్ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. విదేశాల్లోనే కాదు స్వదేశంలోనూ అదే పంథా కొనసాగిస్తున్న రాహుల్ త్వరగా పుంజుకుంటాడో లేదో చూడాల్సిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.