
బలంగా టీమిండియా
భారత్, సౌతాఫ్రికాలను పోలిస్తే సఫారీ జట్టుతో పోలిస్తే టీమిండియానే కాస్త ఎక్కువ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత జట్టు సమతూకంగా ఉంది. రెండో టెస్టు మ్యాచ్‌లో ఓడినప్పటికీ టీమిండియానే ఈ మ్యాచ్‌లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. వెన్నునొప్పితో సెకండ్ టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడనుండడం జట్టుకు బలాన్ని చేకూర్చేది.
ఇక గాయపడ్డ యువ పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. సౌతాఫ్రికా జట్టు విషయానికొస్తే బౌలింగ్‌లో బలంగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో అంత బలంగా కనిపించడంలేదు. కెప్టెన్ ఎల్గర్, బవుమా రూపంలో మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ మిగతా వారిపై భారీ అంచనాలు లేవు. అయితే సెకండ్ టెస్టులో గెలిచిన ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో కనుక భారత జట్టు గెలిస్తే 3 దశాబ్దాల కాలంలో సౌతాఫ్రికాలో తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది.

భారత్‌కు కలిసి రాని కేప్‌టౌన్
సౌతాఫ్రికాలో భారత్ జట్టుకు కలిసి రాని మైదానాల్లో కేప్‌టౌన్ తొలి స్థానంలో ఉంటుంది. ఇప్పటివరకు ఇక్కడ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు. మూడు మ్యాచ్‌ల్లో ఓడి, రెండు డ్రా చేసుకుంది. చివరిగా 2018 పర్యటనలోనూ కేప్‌టౌన్‌లో టీమిండియా ఓడిపోయింది. అతిథ్య సౌతాఫ్రికా ఇక్కడ గత 10 టెస్టులో 7 గెలిచి, 2 ఓడి, ఒకటి డ్రా చేసుకుంది.

రికార్డులకు చేరువలో కోహ్లీ
ఈ మ్యాచ్‌లో మరో 146 పరుగులు చేస్తే టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. అలాగే మరో 14 పరుగులు చేస్తే సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను అధిగమిస్తాడు. మరో 79 పరుగులు చేస్తే రహానే తన కెరీర్‌లో 5 వేల పరుగులను చేరుకుంటాడు. అలాగే సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడకు ఇది 50వ మ్యాచ్.

పిచ్
కేప్‌టౌన్ పిచ్‌ను బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా అనుకూలించనుంది. కాస్త కుదురుకుంటే పరుగులు సాధించడం బ్యాటర్లకు పెద్దగా కష్టమేమి కాదు. పేసర్లతోపాటు స్పిన్నర్లకు కూడా అనుకూలించనుంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇక్కడ ఒక్క అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు.

జట్లు అంచనా
భారత్:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రాహుల్, మయాంగ్ అగర్వాల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, ఠాకూర్, షమీ, బుమ్రా, ఇషాంత్ శర్మ.
సౌతాఫ్రికా:
ఎల్గర్(కెప్టెన్), మాక్రమ్, కీగన్, డసెన్, బవుమా, వెరినె, జాన్సన్, కేశవ్, రబాడ, అలివీర్, ఎంగిర్.


Click it and Unblock the Notifications












