
అహింసే ఆయుధంగా..
ఫస్ట్‌క్లాస్ టికెట్ ఉన్నా తెల్ల దొరలు అహంకారంతో గాంధీని నుంచి గెంటివేయడంతో అవమానం ఎదుర్కొన్నారు. దాంతో బ్రిటిష్ వారిపై పోరాడాలని భారత్‌కు వచ్చి అహింసాయుతంగా పోరాటం సలిపారు. భారతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేశారు. అలాగే దక్షిణాఫ్రికాలో గాంధీజీని ఆదర్శంగా తీసుకుని నెల్సన్ మండేలా అహింసాయుత పోరాటంతో జాతివివక్ష పాలనను అంతం చేశారు.

నెల్సన్ మండేలా..
ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ కోసం కోహ్లీసేన దక్షిణాఫ్రికా చేరుకున్న సంగతి తెలిసిందే. జనవరి ఐదున కేప్‌టౌన్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం ఒక వీడియో ప్రోమోను విడుదల చేసింది. అందులో భారత-దక్షిణాఫ్రికా మైత్రికి చిహ్నంగా గాంధీ మహాత్ముడు, నెల్సన్ మండేలా పోరాటాలను చేర్చింది. రెండు జట్ల మధ్య 1992లో జరిగిన తొలి సిరీస్ జ్ఞాపకాలను ఉంచింది. ఇప్పుడీ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
కొత్త పేరుతో ఫ్రీడమ్ సిరీస్..అని
ఇంతకుముందు రెండు దేశాల మధ్య జరిగిన సిరీస్‌లను ‘ఫ్రెండ్‌షిప్ సిరీస్'లు అనేవారు. ఇప్పడు ఆ పేరును ‘ఫ్రీడమ్ సిరీస్'గా మార్చేశారు. రెండు దేశాలు వలసపాలనలో బాధలు అనుభవించాయి. అలాగే క్రికెట్‌ను విపరీతంగా అభిమానిస్తాయి. అందులోనూ నిషేధం తర్వాత సఫారీలతో తొలి సిరీస్ ఆడిందీ భారతే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పేరు మార్పు చేశారు.

కోహ్లీ సారథ్యంలో ..
1992లో అజారుద్దీన్ సారథిగా టీమిండియా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. సఫారీల జట్టుకు క్లైవ్ రైస్ సారథి. నాలుగు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-0 తేడాతో గెలిచింది. ఏడు వన్డేల సిరీస్‌ను 5-2తో కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు అక్కడ సిరీస్ గెలవని టీమిండియా ఈ సారి ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. కోహ్లీ సారథ్యంలోని బృందం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












