Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీలతో సిరీస్‌కు జట్టు ఎంపిక..: రాహుల్‌ ఔట్, గిల్‌కు పిలుపు, ఓపెనర్‌గా రోహిత్

India vs South Africa, Test squad selection: kl rahul dropped, shubhman gill gets maiden call

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు గురువారం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. అందరూ ఊహించినట్లే ఈ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు.

విండిస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన రాహుల్‌ను తప్పించాలని విమర్శలు వచ్చిన నేపథ్యంలో సెలక్టర్లు అతడిని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విండిస్ పర్యటనకు ఎంపికై.. తుది జట్టులో చోటు దక్కించుకోలేని రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. దీంతో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

శుభమాన్ గిల్‌కు పిలుపు

శుభమాన్ గిల్‌కు పిలుపు

దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని అన్ని ఫార్మాట్లలో రాణించిన యువ ఆటగాడు శుభమాన్ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి పిలుపు వచ్చింది. సపారీలతో టీ20 సిరిస్‌కు ఎంపిక కాని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టెస్టు్ల్లో చోటు కల్పించారు. మరో స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు మొండిచేయి చూపించారు. రిషభ్‌ పంత్‌తో పాటు వృద్ధిమాన్‌ సాహాను ఎంపిక చేశారు.

3 టీ20లు, 3 వన్డేల సిరిస్

భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. తొలుత మూడు టీ20ల సిరిస్ జరుగుతుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. టీ20 సిరిస్‌కు ధర్మశాల, మొహాలి(సెప్టెంబర్ 18), బెంగళూరు(సెప్టెంబర్ 22) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి.

విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు

విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టుకు విశాఖపట్నం(అక్టోబర్ 2-6) ఆతిథ్యమిస్తోంది. ఆ తర్వాత పుణె(అక్టోబర్ 10-14), రాంచీ(అక్టోబర్ 19-23) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి.

టెస్టు మ్యాచ్ షెడ్యూల్

విశాఖఫట్నం: October 2-6, 9:30 AM IST

పూణె: October 10-14, 9:30 AM IST

రాంచీ: October 19-23, 9:30 AM IST

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు టీమిండియా:

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు టీమిండియా:

విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే (వైస్‌కెప్టెన్) రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మహ్మద్ షమి, బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌

Story first published: Friday, September 13, 2019, 11:04 [IST]
Other articles published on Sep 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+