For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: నేటి నుంచే తొలి టెస్ట్.. గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి టీమిండియా

India vs South Africa Test series starts today

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది. గెలుపెవరిది అంటూ అటు మాజీలు, ఇటు అభిమానులు వేసిన అంచనాల‌కు కార్య‌రూపం దాల్చాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. త‌మ‌దే విజ‌యం అంటూ ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేసిన కెప్టెన్ల‌కు ఇక‌ అస‌లైన ప‌రీక్ష ప్రారంభంకానుంది. తాము మెరుగ్గా రాణిస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన ఆట‌గాళ్లు.. ఇక మాట‌లు ఆపి గ్రౌండ్‌లోకి దిగాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. మొత్తంగా ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై ఈ సారైనా గెలిచి చ‌రిత్ర సృష్టించ‌డానికి నాలుగేళ్ల త‌ర్వాత‌ భారత్‌కు మ‌ళ్లీ అవ‌కాశం వ‌చ్చింది.

 నేటి నుంచే టెస్ట్ సిరీస్‌

నేటి నుంచే టెస్ట్ సిరీస్‌

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టెస్టులుగా జ‌రుగుతున్న ఈ సిరీస్‌లో సెంచూరియ‌న్ వేదిక‌గా నేటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. బాక్సింగ్ డే సంద‌ర్భంగా ప్రారంభ‌మ‌వుతున్న ఈ సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో విప‌రీత‌మెన ఆస‌క్తి నెల‌కొంది.

టీమిండియాను విరాట్ కోహ్లీ న‌డిపించ‌నుండ‌గా, సౌతాఫ్రికాను టెంబా బావుమా న‌డిపించ‌నున్నాడు. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌కు విదేశాల్లో ఇదే తొలి స‌వాల్‌. అలాగే ఇటీవ‌ల ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీ కోల్పోవ‌డంతోపాటు, ఫామ్‌లో లేని కెప్టెన్ కోహ్లీకి కూడా ఈ సిరీస్ డూ ఆర్ డై లాంటింది.

కాగా సౌతాఫ్రికా గ‌డ్డ‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెల‌వ‌ని భార‌త్‌.. ఈ సారి గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతోంది. ప్ర‌స్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో బ‌లంగా ఉంది. అదే స‌మ‌యంలో టీమిండియాతో పోలిస్తే అతిథ్య సౌతాఫ్రికా కాస్త బ‌ల‌హీనంగా ఉంది.

ఆ జ‌ట్టు బౌలింగ్ యూనిట్‌ ప‌టిష్టంగానే ఉన్న‌ప్ప‌టికీ, బ్యాటింగ్ యూనిట్ బ‌ల‌హీనంగా ఉంది. కొంత‌కాలంగా విదేశాల్లో టీమిండియా మంచి విజ‌యాలు సాధించింది. దీంతో 3 ద‌శాబ్దాల వెల‌తిని తీరుస్తూ సౌతాఫ్రికా గ‌డ్డ‌పై టీమిండియా టెస్టు సిరీస్ గెల‌వ‌డానికి ఇదే మంచి స‌మ‌యం అని మాజీల‌తోపాటు అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

స‌మ‌స్య‌గా జ‌ట్టు కూర్పు

స‌మ‌స్య‌గా జ‌ట్టు కూర్పు

ప్ర‌స్తుతం టీమిండియాకు జ‌ట్టు కూర్పు స‌మ‌స్యగా మారింది. తుది జ‌ట్టులో ఎవ‌రిని ఉంచాలి, ఎవ‌రిని తొల‌గించాలి అనే డైల‌మా ఉంది. ఓపెన‌ర్‌గా లోకేష్ రాహుల్ ఖ‌రారు కాగా అతనికి జ‌త‌గా మ‌యాంక్ అగర్వాల్‌, శుభ్‌మాన్ గిల్‌లో ఎవ‌రిని పంపుతార‌నేవొ ఆస‌క్తిగా మారింది.

ఐదో స్థానంలో ఎవ‌రిని ఆడించాల‌నేది టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఆ స్థానంలో ఎంతో కాలంగా ఆడుతున్న సీనియ‌ర్ ఆట‌గాడు అంజిక్యా ర‌హానే కొంత కాలంగా ఫేల‌వ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవ‌ల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఐదో స్థానంలో ఆడిన శ్రేయ‌స్ అయ్య‌ర్ బాగా ఆడాడు.

దీంతో ర‌హానే, అయ్య‌ర్‌లో ఎవ‌రిని ఆడించాల‌నేది టీమిండియాకు క‌న్‌ఫ్యూజ‌న్‌గా మారింది. ఆల్‌రౌండ‌ర్ కోటాలో శార్దూల్ ఠాకూర్ కూడా ఉండ‌నున్నాడు. వికెట్ కీప‌ర్‌గా రిష‌బ్ పంత్ ఖ‌రారు కాగా, స్పిన్న‌ర్‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆడ‌డం కూడా ఖాయ‌మే. పేస‌ర్లుగా బుమ్రాతోపాటు మ‌హ్మ‌ద్‌ష‌మీ కూడా జ‌ట్టులో ఉండ‌నున్నారు.

అయితే మూడో పేస‌ర్‌గా ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేష్ యాద‌వ్‌, మ‌హ్మ‌ద్‌ సిరాజ్‌ల‌లో ఎవ‌రూ ఉంటార‌నేది ఆస‌క్తిక‌రం. న‌లుగురు పేస‌ర్ల‌ను తీసుకుంటే సిరాజ్ ప్లేస్ ఖాయం కాగా.. ఇషాంత్‌, ఉమేష్‌ల‌లో ఒక‌రికి చోటు ల‌భించ‌నుంది.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌

టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌

నేటి నుంచి ఈ నెల 30 వ‌ర‌కు సెంచూరియ‌న్ వేద‌కగా తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రెండో టెస్ట్ మ్యాచ్ జ‌న‌వరి 3 నుంచి 7 వ‌ర‌కు జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఇక సిరీస్‌లో చివ‌రిదైన మూడో టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్ వేదిక‌గా జ‌న‌వ‌రి 11 నుంచి 15 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3తోపాటు స్థానిక భాష‌లైన తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళం ఛాన‌ల్స్‌లో కూడా మ్యాచ్ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానుంది. వీటితోపాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయినా డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా ఈ మ్యాచ్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది.

టెస్టు సిరీస్‌కు ఎంపికైన భార‌త జ‌ట్టు

టెస్టు సిరీస్‌కు ఎంపికైన భార‌త జ‌ట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్‌), ప్రియాంక్ పంచాల్, మయాంక్ అగర్వాల్, చ‌టేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీప‌ర్‌), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మ‌హ్మ‌ద్‌ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్.

స్టాండ్‌బై ప్లేయర్స్: నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జన్ నాగ్వాస్వాల్లా.

టెస్టు సిరీస్‌కు ఎంపికైన సౌతాఫ్రికా జ‌ట్టు

టెస్టు సిరీస్‌కు ఎంపికైన సౌతాఫ్రికా జ‌ట్టు

డీన్ ఎల్గర్, టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్‌), కగిసో రబడ, సరెల్ ఎర్వీ, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్‌గిడి, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, అన్రిచ్ నార్ట్జే, కీగన్ పీటర్‌సెన్, డ్యూస్సీ . కైల్ వెర్రేన్నే, మార్కో జాన్సెన్, గ్లెంటన్ స్టౌర్‌మాన్, ప్రెనెలన్ సుబ్రాయెన్, సిసాండా మగాలా, ర్యాన్ రికెల్టన్, డువాన్ ఆలివర్.

Story first published: Sunday, December 26, 2021, 8:10 [IST]
Other articles published on Dec 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+