Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa: టీమిండియా బౌలర్లు సంచలనం..నమోదైన హ్యాట్రిక్!

జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పేసర్లు చెలరేగుతున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లకు వణుకుపుట్టేలా బంతులు సంధిస్తున్నారు. వికెట్ల వేటలో ఫాస్ట్ బౌలర్లు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ పోటీపడుతున్నారు. వీరిద్దరి ధాటికి 58 పరుగులకే ఆతిథ్య జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. హెండ్రిక్స్, డసెన్ ముల్డర్ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు.

అయితే టీమిండియా జట్టుగా హ్యాట్రిక్ సాధించింది. వరుసగా మూడు వికెట్లు తీసింది. పదో ఓవర్ ఆఖరి బంతికి క్లాసెన్ (6)ను అర్షదీప్ క్లీన్‌బౌల్డ్ చేశారు. తర్వాత ఓవర్ తొలి రెండు బంతులకు అవేశ్ ఖాన్ వరుసగా రెండు వికెట్లు సాధించాడు. మార్క్‌రమ్ (2)ను తొలి బంతికి క్లీన్‌బౌల్డ్ చేసిన అవేశ్.. తర్వాత బంతికి ముల్డర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో టీమిండియా వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ నమోదుచేసింది.

India vs South Africa: Team Indias bowlers sensational performance. Hattrick registered

వికెట్ల వేటను అర్షదీప్ మొదలుపెట్టాడు.రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో కీలక రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.హెండ్రిక్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన అర్షదీప్ తర్వాతి బంతికే డసెన్‌(0)ను పెవిలియన్‌కు పంపాడు.అర్షదీప్ నాలుగు వికెట్లు సాధించగా, అవేశ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

కాగా,ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. బ్రస్ట్ కాన్సర్ అవగాహన కోసం సఫారీ సేన పింక్ జెర్సీని ధరించనుంది.మరోవైపు భారత యువ ప్లేయర్ సాయి సుదర్శన్ ఇవాళ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓపెనర్‌గా అతడు 56 సగటుతో పరుగులు చేశాడు.

జట్టు వివరాలు
భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ (కెప్టెన్ ), సంజు శాంసన్, అక్షర్ పటేల్,అర్షదీప్ సింగ్,అవేష్ ఖాన్,కుల్‌దీప్ యాదవ్,ముకేశ్ కుమార్

దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, డస్సెన్, మార్క్‌రమ్ (కెప్టెన్),హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఫెహ్లుక్వాయో , కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, షంసీ

Story first published: Sunday, December 17, 2023, 14:56 [IST]
Other articles published on Dec 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+